MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమరో 24 గంటలలో విడుదలకాబోతున్న ‘దేవర’ ఫలితం గురించి ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీకి సంబంధించిన ఫలితం ఈరోజు అర్థరాత్రి దాటిన తరువాత తారక్ అభిమానులతో పాటు అందరి హీరోల అభిమానులకు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడ ఈసినిమా ఫైనల్ టాక్ గురించి అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు అర్థరాత్రి దాటిన తరువాత ఈ మూవీ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ఈ మూవీ ప్రీమియర్ షోల టిక్కెట్ ధర 5వేలు పెట్టినప్పటికీ అభిమానులు లెDEVARA{#}Audience;Industry;Jr NTR;News;Cinema15 నిముషాల పై పెరిగిపోతున్న ఆతృత !15 నిముషాల పై పెరిగిపోతున్న ఆతృత !DEVARA{#}Audience;Industry;Jr NTR;News;CinemaThu, 26 Sep 2024 14:06:00 GMTమరో 24 గంటలలో విడుదలకాబోతున్న ‘దేవర’ ఫలితం గురించి ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీకి సంబంధించిన ఫలితం ఈరోజు అర్థరాత్రి దాటిన తరువాత తారక్ అభిమానులతో పాటు అందరి హీరోల అభిమానులకు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడ ఈసినిమా ఫైనల్ టాక్ గురించి అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.



ఈరోజు అర్థరాత్రి దాటిన తరువాత ఈ మూవీ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ఈ మూవీ ప్రీమియర్ షోల టిక్కెట్ ధర 5వేలు పెట్టినప్పటికీ అభిమానులు లెక్కచేయకుండా ఆ టిక్కెట్లను కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిన్నచిన్న పల్లెటూర్లలో కూడ ఈమూవీ ప్రీమియర్ షోల టిక్కెట్ల ధర 1000 రూపాయలు పెట్టారని తెలుస్తోంది.



అర్థరాత్రి షోల తరువాత తెల్లవారుఝామున కూడ ఈమూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు వేస్తున్నట్లు ఆతరువాత ఉదయం నుండి ఈమూవీ రెగ్యులర్ షోలు ఉంటాయని తెలుస్తోంది. ఈమూవీని ప్రమోట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అన్న మాటలు ఈమూవీ పై మరింత అంచనాలు పెంచుతున్నాయి. ఈమూవీకి సంబంధించిన చివరి 15 నిముషాలు ప్రేక్షకులను విపరీతంగా ఎంగేజ్ చేసే విధంగా ఉండబోతుందని ముఖ్యంగా ఈమూవీ క్లైమాక్స్ ముగిసిన తరువాత బయటకు వచ్చే ప్రేక్షకులు ‘దేవర’ పార్ట్ 2 కోసం అత్యంత ఆశక్తిగా ఎదురు చూసే విధంగా ఈమూవీ క్లైమాక్స్ ఉంటుందని లీకులు వస్తున్నాయి.



ఇప్పటికే ‘దేవర’ రెండో భాగం గురించి రకరకాల ఊహాగానాలువస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాకు సంబంధించిన చివరి 45 నిముషాలలో వచ్చే ట్విస్ట్ లు ‘బాహుబలి’ పార్ట్ కు మించి ఉంటాయని దీనితో ఈసినిమాను చూసిన ప్రేక్షకులు ఈమూవీ సీక్వెల్ ఎంత త్వరగా వస్తే అంత బాగుంటుంది అని ధియేటర్ల నుంచి బయటకు వస్తారని లీకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాకు ఏర్పడిన క్రేజ్ తో ఈ మూవీ ఓపెనింగ్ కలక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు మించి ఉంటాయని మరొక అంచనా..  










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>