Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood045a1810-fd89-47af-836c-45968aa86bd7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kollywood045a1810-fd89-47af-836c-45968aa86bd7-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలకు ఎంతలా డిమాండ్ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి సినిమా తీశారు అంటే చాలు ఇక ఎంత బడ్జెట్ పెట్టడానికైనా నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇలా మల్టీస్టారర్ మూవీస్ మినిమం గ్యారంటీ సినిమాలు గా మారిపోయాయి. ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు థియేటర్లకు తరలివస్తారు కాబట్టి ఇక కాస్త యావరేజ్ టాక్ వచ్చిన కూడా నిర్మాతలకు రావాల్సిన మొత్తం వచ్చేస్తుంది. అందుకే ఇలాంటి సినిమాలకు కాస్త రిస్క్ చేయడానికి కూడా నిర్మాతలుkollywood{#}shankar;surya sivakumar;Kollywood;Tamil;Darsakudu;Director;Cinemaహీరోలుగా సూర్య, విక్రమ్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే అంచనాలు పెరిగిపోతాయి?హీరోలుగా సూర్య, విక్రమ్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే అంచనాలు పెరిగిపోతాయి?kollywood{#}shankar;surya sivakumar;Kollywood;Tamil;Darsakudu;Director;CinemaThu, 26 Sep 2024 15:20:00 GMTఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలకు ఎంతలా డిమాండ్ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి సినిమా తీశారు అంటే చాలు ఇక ఎంత బడ్జెట్ పెట్టడానికైనా నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇలా మల్టీస్టారర్ మూవీస్ మినిమం గ్యారంటీ సినిమాలు గా మారిపోయాయి. ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు థియేటర్లకు తరలివస్తారు కాబట్టి ఇక కాస్త యావరేజ్ టాక్ వచ్చిన కూడా నిర్మాతలకు రావాల్సిన మొత్తం వచ్చేస్తుంది.


 అందుకే ఇలాంటి సినిమాలకు కాస్త రిస్క్ చేయడానికి కూడా నిర్మాతలు సిద్ధమైపోతున్నారు. కాగా ఇక క్రేజీ కాంబినేషన్లో మల్టీస్టారస్ సినిమాలు వస్తే ఇక ఆ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక క్రేజీ మల్టీ స్టారర్ కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రయోగాలు చేసే హీరోలలో స్టార్ హీరోలైన సూర్య విక్రమ్ లు ముందు వరుసలో ఉంటారు   అయితే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే ఇక ఆ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఇక ప్రయోగాత్మక సినిమాలు చేసే ఈ ఇద్దరు హీరోలతో ప్రయోగం అనే పదానికి కేరాఫ్ అడ్రస్ అయిన శంకర్ సినిమా తీస్తే అబ్బో కాంబినేషన్ పేరు చెబుతుంటేనే అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా ఇక ఇప్పుడు ఇలాంటి ఒక క్రేజీ కాంబో రిపీట్ కాబోతుందట  తమిళ స్టార్ హీరోలు విక్రమ్, సూర్యతో దర్శకుడు శంకర్ సినిమా తెరకెక్కించబోతున్నాడట. వేల్పరి నవల ఆధారంగా మూవీ ని తీయబోతున్నట్లు కోలీవుడ్లో చర్చ నడుస్తుంది. ఇదే విషయంపై హీరోలతో దర్శకుడు చర్చలు కూడా జరుపుతున్నారని సమాచారం. ఈ సినిమాను మూడు పార్టీల్లో తీసుకురావాలని అనుకుంటున్నారట. ఇదే నిజమైతే మాత్రం నిజంగా అదొక విజువల్ వండర్ అవుతుంది అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>