MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devrera9ef58c12-aca2-4ac7-9a68-bf473f5758c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devrera9ef58c12-aca2-4ac7-9a68-bf473f5758c9-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదలకి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండడంతో ముఖ్యంగా నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా హడావుడి కేవలం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇండియా అంతటా కనబడుతోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మైథలాజికల్, పీరియాడికల్ జోనర్ సినిమాలు ఎక్కువగా క్లిక్ కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తయారైన సినిమానే ఎన్టీఆర్ నటించిన దేవర! devrera{#}Genre;kushi;Kushi;media;Hyderabad;Darsakudu;India;Telugu;Director;NTR;Cinema'దేవర' ఇండియన్ అవెంజర్స్, బ్యాట్ మ్యాన్ అంటున్నారు?'దేవర' ఇండియన్ అవెంజర్స్, బ్యాట్ మ్యాన్ అంటున్నారు?devrera{#}Genre;kushi;Kushi;media;Hyderabad;Darsakudu;India;Telugu;Director;NTR;CinemaThu, 26 Sep 2024 11:50:00 GMTజూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదలకి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండడంతో ముఖ్యంగా నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా హడావుడి కేవలం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇండియా అంతటా కనబడుతోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మైథలాజికల్, పీరియాడికల్ జోనర్ సినిమాలు ఎక్కువగా క్లిక్ కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తయారైన సినిమానే ఎన్టీఆర్ నటించిన దేవర!

మరో 15 గంటల్లో దేవర స్టామినా ఏంటో తేలిపోతుంది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 'చుట్టమల్లె, ఫియర్ సాంగ్' మొదలుకొని టీజర్, ట్రైలర్స్ సినిమా పై అంచనాలను పెంచేసాయి. ఓ వర్గం వారు వీటిపై పెదవి విరిచినప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం చాలా ఆశలతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా గురించి అనిరుద్ తాజాగా ఓ మీడియా వేదికగా చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. తాను కూడా ఈ సినిమాని హైదరాబాద్ లో ఫ్యాన్స్ తో కలిసి చూస్తానని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా, అవెంజర్స్, బ్యాట్ మెన్ సినిమాలు చూస్తున్న ఫీల్ దేవర మీకు కలిగిస్తుందని అన్నారు. దాంతో ఫాన్స్ కి పూనకాలు వచ్చేసాయి.

ఈ నేపథ్యంలోనే ఓన్లీ విజువల్స్ మాత్రమే కాకుండా... దేవరలో యాక్షన్, సెంటిమెంట్, డ్రామా అన్ని ప్రధాన అంశాలు దర్శకుడు జోడించాడని చెప్పాడు. దాంతో దేవర థ్రిల్ ఇస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇకపోతే దేవర సినిమా పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ వైడ్ గా కూడా హడావుడి చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి దేవర ప్రీమియర్స్ మొదలైనట్టు టాక్ వినబడుతోంది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర దేవర 1 గా నిలుస్తుందని గుసగుసలు కూడా వినబడుతున్నాయి. ఈ సినిమాలో ఎన్ టీ ఆర్ డ్యుయల్ రోల్ చేసాడనే విషయం విదితమే. ఇదే విషయాన్ని ట్రైలర్ చూస్తేనే అర్ధం అయిపోతుంది. మరి దేవర ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>