MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-717beae2-c484-45b6-8d0b-dc7ef3b16a5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-717beae2-c484-45b6-8d0b-dc7ef3b16a5a-415x250-IndiaHerald.jpg 60 సంవత్సరాలు పైబడిన కూడా ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా బాక్సాఫీస్ కి దడ పుట్టిస్తున్నాడు మెగాస్టార్. ఇక చిరంజీవి వ్యక్తిగత జీవితం గురించి కూడా అందరికీ తెలిసిందే. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలోనే తెలుగు అగ్ర కమెడియన్ అల్లు రామలింగయ్య ఆయన కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశారు. అలా చిరంజీవికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే వివాహం జరిగింది. Chiranjeevi {#}jayaprada;kajal aggarwal;School;Girl;Love;Chiranjeeviచిరంజీవి ఫస్ట్ లవ్ ఎవరూ అంటే? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!చిరంజీవి ఫస్ట్ లవ్ ఎవరూ అంటే? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!Chiranjeevi {#}jayaprada;kajal aggarwal;School;Girl;Love;ChiranjeeviThu, 26 Sep 2024 09:49:45 GMTటాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నా క్రేజ్‌ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. నేటితరం హీరోలకు యువతకు ఆయన ఓ రోల్ మోడల్. అలాంటి చిరంజీవి గురించి ఎన్నో విషయాలు మనందరికీ తెలుసు.  60 సంవత్సరాలు పైబడిన కూడా ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా బాక్సాఫీస్ కి దడ పుట్టిస్తున్నాడు మెగాస్టార్. ఇక చిరంజీవి వ్యక్తిగత జీవితం గురించి కూడా అందరికీ తెలిసిందే. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలోనే తెలుగు అగ్ర కమెడియన్ అల్లు రామలింగయ్య ఆయన కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశారు. అలా చిరంజీవికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే వివాహం జరిగింది.


ఇక చిరు తన కెరీర్ లో ఎందరో అగ్ర హీరోయిన్లతో నటించాడు..జయసుధ, జయప్రద నుంచి నేటితరం తమన్నా, కాజల్ వంటి హీరోయిన్లతో కూడా చిరు ఆడి పాడాడు. అయితే ఇన్ని సంవత్సరాల తన సినీ కెరీర్లో ఆయనపై ఎఫైర్ రూమర్స్ వినిపించింది తక్కువే.  అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి ఫస్ట్ లవ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే విషయాన్ని గతంలో చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో  ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.


అయితే తన ఫస్ట్ లవ్ ఎప్పుడు? ఎవరితోనో వెల్లడించాడు.  ఆ  ఇంటర్వ్యూలో చిరు త‌న మొద‌టి ల‌వ్ గురించి ఆస్తికర  విష‌య‌లు పంచుకున్న‌డు..  ''నా ఫస్ట్ లవ్ అంటే 7వ తరగతి చదివే రోజుల్లో. ఓ అమ్మాయి సైకిల్ తొక్కుతూ స్కూల్ కి వెళ్ళేది. ఆ రోజుల్లో మా మొగల్తూరులో అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మామూలు విషయం కాదు. ఆ అమ్మాయితో నాకు చనువు ఉండేది. నాకు సైకిల్ తొక్కడం రాదు. వచ్చు కానీ ఎక్స్పర్ట్ ని కాదు. నాకు కూడా సైకిల్ నేర్పుతావా? అని, ఆ అమ్మాయిని అడిగేవాడిని. ఆ అమ్మాయి నాకు సైకిల్ నేర్పేది. నేను సైకిల్ తొక్కుతుంటే.. అమ్మాయి వెనుక పట్టుకునేది. నేనేమో సైకిల్ తొక్కుతూ ముందు చూడకుండా.. వెనక్కి తిరిగి ఆ అమ్మాయి ముఖం చూడటానికి ప్రయత్నం చేసేవాడిని.. ఆ అమ్మాయి ముందు చూడు, అనేది.  ఆమె పేరు చెప్పను కానీ.. తనే నా ఫస్ట్ లవ్'', అని చిరంజీవి తన రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>