MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/devara-moviea6acaac1-8618-4017-9f37-358a4b7db421-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/devara-moviea6acaac1-8618-4017-9f37-358a4b7db421-415x250-IndiaHerald.jpgసినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'దేవర'. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన అంటే రేపు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ప్రతి ఒక్క సినీ అభిమానుల్లో మరింతగా ఆసక్తిని పెంచుతున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో నటించిన దేవర సినిమా భారీ అంచనాలు నడుమ విడుదల కానుంది. కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు ఎన్టీఆర్. Devara Movie{#}Success;Varsham;Chitram;Saif Ali Khan;Janhvi Kapoor;Sridevi Kapoor;Jr NTR;Telugu;NTR;Cinema;News;Directorదేవరకు కష్టాలు...యాగం చేస్తున్న ఎన్టీఆర్‌ ?దేవరకు కష్టాలు...యాగం చేస్తున్న ఎన్టీఆర్‌ ?Devara Movie{#}Success;Varsham;Chitram;Saif Ali Khan;Janhvi Kapoor;Sridevi Kapoor;Jr NTR;Telugu;NTR;Cinema;News;DirectorThu, 26 Sep 2024 12:18:00 GMTసినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'దేవర'. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన అంటే రేపు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ప్రతి ఒక్క సినీ అభిమానుల్లో మరింతగా ఆసక్తిని పెంచుతున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో నటించిన దేవర సినిమా భారీ అంచనాలు నడుమ విడుదల కానుంది. కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు ఎన్టీఆర్.


దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో దేవర చిత్ర యూనిట్ ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రతి ఒక్కరం చూసాం. ఇక తారక్ విదేశాల్లోనూ సందడి చేస్తున్నాడు. మరికొద్ది గంటల్లో దేవరగా థియేటర్స్ లో ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నాడు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఆకాశం మొత్తం మెగా వృత్తమై ఉండడంతో భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల భారీగా వర్షాలు కూడా పడుతున్నాయి.


దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా చోట్ల వరుణ దేవుడిని శాంతింప చేయడం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దేవర సినిమాకి ఎలాంటి ఆటంకం కలిగించవద్దని .....చాలా సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని.... ఈ అర్ధరాత్రి నుంచి సినిమా రాబోతుందని చెప్పి వరుణ దేవుడిని వేడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ అభిమానులు కూడా దేవుడిని ప్రార్థించుకుంటున్నారట.


కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించి అలరించనుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను పోషించాడు. ఇక ఎన్నో అంచనాలు నడుమ విడుదల కాబోతున్న ఈ చిత్రం ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>