Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni0046b0d6-83ea-4585-8528-63e128e17b08-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni0046b0d6-83ea-4585-8528-63e128e17b08-415x250-IndiaHerald.jpgటీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇక ఆయా ఆటగాళ్ల గురించి ప్రేక్షకులు అందరూ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ధోని విషయంలో మాత్రం ఇలా జరగలేదు. ఎందుకంటే 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఇంకా యాక్టివ్ క్రికెటర్లతో పోల్చి చూస్తే ధోనీకే ఎక్కువగా క్రేజ్ ఉంది. ధోని కనిపించాడు అంటే చాలు ఏకంగా తెగ మురిసిపోయే అభిమానులు కోట్లలోనే ఉన్నారుdhoni{#}MS Dhoni;Mohit Sharma;Mister;Chennai;INTERNATIONAL;Audience;deepak;Indiaధోని మిస్టర్ కూల్ కాదు.. షాకింగ్ విషయం చెప్పిన CSK మాజీ బౌలర్?ధోని మిస్టర్ కూల్ కాదు.. షాకింగ్ విషయం చెప్పిన CSK మాజీ బౌలర్?dhoni{#}MS Dhoni;Mohit Sharma;Mister;Chennai;INTERNATIONAL;Audience;deepak;IndiaThu, 26 Sep 2024 15:59:00 GMTటీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇక ఆయా ఆటగాళ్ల గురించి ప్రేక్షకులు అందరూ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ధోని విషయంలో మాత్రం ఇలా జరగలేదు. ఎందుకంటే 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఇంకా యాక్టివ్ క్రికెటర్లతో పోల్చి చూస్తే ధోనీకే ఎక్కువగా క్రేజ్ ఉంది.


 ధోని కనిపించాడు అంటే చాలు ఏకంగా తెగ మురిసిపోయే అభిమానులు కోట్లలోనే ఉన్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్లో మాత్రం తన ఆటని కొనసాగిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ధోని. కాగా ధోని కెప్టెన్సీలో దిట్టా. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే సహనాన్ని కోల్పోకుండా ఎంతో కూల్ గా కనిపిస్తూ ఉంటాడు. అందుకే మహేంద్ర సింగ్ ధోనిని మిస్టర్ కూల్ కెప్టెన్ అని పిలుస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు చూస్తూ ఉంటే అసలు ధోనీకి కోపం రాదా.. ఒక మనిషి ఇలా ఎలా ఉండగలడు అనే అనుమానం కూడా ప్రేక్షకుల్లో కలుగుతూ ఉంటుంది.



 అయితే ఇటీవల ఇదే విషయంపై ధోని కెప్టెన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున గతంలో ప్రాతినిధ్యం వహించిన మోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ కూల్ గా పేరు ఉన్న మహేందర్ సింగ్ ధోనీకి కూడా కోపం వస్తుంది అంటూ తెలిపారు. మ్యాచ్ కీలకంగా ఉన్న క్షణాల్లో ధోని కి కోపం వచ్చింది. బేవకూఫ్ తూ నహి హై.. బేవకూఫ్ మై హు అంటూ తిట్టారు ధోని. ఇక ఈ విషయాన్ని మోహిత్ శర్మ ఒక పాడ్ కాస్ట్ లో గుర్తు చేసుకున్నారు. ఆయనలోని ఈ కోణాన్ని కొద్దిమంది మాత్రమే చూశారు అంటూ చెప్పుకొచ్చాడు  దీపక్ చాహార్ కూడా ఇలా ధోనీ చేతిలో తిట్లు తిన్నవాడే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇది కేవలం గ్రౌండ్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది అంటూ తెలిపాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>