MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/herois-ae4b2230-5937-4a9c-8082-c00f1888c355-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/herois-ae4b2230-5937-4a9c-8082-c00f1888c355-415x250-IndiaHerald.jpgఇండియాలో మిగతా సినిమా పరిశ్రమలు వేరు, తెలుగు సినిమా పరిశ్రమ వేరు. బేసిగ్గా టాలీవుడ్ కొత్త కొత్త అమ్మాయిలను దించుతూ ఉంటుంది. విచిత్రమైన అందాలను చూడాలంటే ఇక్కడికి రావాల్సిందే. అందుకే ఇక్కడ సంవత్సరానికి ఒక్కరు ఫేమస్ అవుతూ ఉంటారు. అవును, తెలుగులో యంగ్ బ్యూటీలకు కొదువే ఉండదు. అందుకే తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టడం కోసం వివిధ రాష్ట్రాలవారు క్యూలు కడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ బోలెడు మంది అమ్మాయిలు తమ యాక్టింగ్ తో మెప్పిస్తున్నారు. అయితే, ఈ పరిశ్రమలో అయినా చిన్న, పెద్ద హీరోయిన్లు ఉన్నట్టే ఇక్కడ కూడా ఉherois {#}Rocky;dulquer salmaan;neha shetty;Devarakonda;anil ravipudi;Viswak sen;Chaitanya;Mister;Yuva;Kanna Lakshminarayana;Joseph Vijay;Guntur;Heroine;Industries;Hero;Jr NTR;Cinema;Tollywood;Teluguనెం.1 స్థానానికి పోటీపడుతున్న ముద్దుగుమ్మలు!నెం.1 స్థానానికి పోటీపడుతున్న ముద్దుగుమ్మలు!herois {#}Rocky;dulquer salmaan;neha shetty;Devarakonda;anil ravipudi;Viswak sen;Chaitanya;Mister;Yuva;Kanna Lakshminarayana;Joseph Vijay;Guntur;Heroine;Industries;Hero;Jr NTR;Cinema;Tollywood;TeluguWed, 25 Sep 2024 10:57:00 GMTఇండియాలో మిగతా సినిమా పరిశ్రమలు వేరు, తెలుగు సినిమా పరిశ్రమ వేరు. బేసిగ్గా టాలీవుడ్ కొత్త కొత్త అమ్మాయిలను దించుతూ ఉంటుంది. విచిత్రమైన అందాలను చూడాలంటే ఇక్కడికి రావాల్సిందే. అందుకే ఇక్కడ సంవత్సరానికి ఒక్కరు ఫేమస్ అవుతూ ఉంటారు. అవును, తెలుగులో యంగ్ బ్యూటీలకు కొదువే ఉండదు. అందుకే తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టడం కోసం వివిధ రాష్ట్రాలవారు క్యూలు కడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ బోలెడు మంది అమ్మాయిలు తమ యాక్టింగ్ తో మెప్పిస్తున్నారు. అయితే, ఈ పరిశ్రమలో అయినా చిన్న, పెద్ద హీరోయిన్లు ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నారు. అందులో ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్ల మధ్య టాప్ ప్లేస్ కోసం పలువురు బ్యూటీలు పోటీ పడుతున్నారని చాలా స్పష్టంగా అర్ధం అవుతోంది.

ఈ లిస్టులో మీనాక్షి చౌదరీ.. అందరి కన్నా ముందు ఉందని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో మీనాక్షి చౌదరీకి ఫుల్ డిమాండ్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటు సీనియర్ ఇటు జూనియర్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. 2024 సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారంలో నటించిన అమ్మడు.. రీసెంట్ గా విజయ్ ది గోట్ లో మెరిసిన సంగతి అందరికీ తెలిసినదే. అదేవిధంగా ప్రస్తుతం వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లో యాక్ట్ చేస్తోంది. మరోవైపు మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమాలో కూడా నటిస్తోంది.

అదేవిధంగా రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన.. హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే కూడా టాప్ ప్లేస్ పై కన్నేసినట్టు కనబడుతోంది. ఈమె ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ మూవీలో నటిస్తోంది. రానా, దుల్కర్ సల్మాన్ మల్టీస్టారర్ లో కూడా నటిస్తున్నట్టు సమాచారం. హీరోయిన్ నభా నటేష్.. గురించి కూడా తెలిసిందే. ఈమె ఇప్పుడు స్వయంభులో యాక్ట్ చేస్తోంది. యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభులో నభ ముఖ్యపాత్ర పోషిస్తోంది. మరోవైపు, నేహా శెట్టి వరుస సినిమాల్లో నటిస్తోంది. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కూడా యంగ్ హీరోయిన్లతో పాటు రేసులో ఉంది. వీరంతా ఎన్ని సినిమాలలో నటిస్తున్నా, వీరు గురి మొత్తం టాప్ ప్లేసుపైనే ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>