MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-beautyni-namminchi-mosam-chesina-harsha-sai2eac123f-1959-437e-a790-c2a63e6d21fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-beautyni-namminchi-mosam-chesina-harsha-sai2eac123f-1959-437e-a790-c2a63e6d21fe-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరి భాగోతాలు బయటపడుతున్నాయి.మొన్నటి వరకు రాజకీయ నాయకుల వంతైతే ఇప్పుడు సినీ సెలెబ్రెటీల వంతయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్యనే జానీ మాస్టర్ బాగోతం బయటపడింది.అయితే తాజాగా నటుడు ఫేమస్ యూట్యూబర్ అయినటువంటి హర్ష సాయిపై ఓ యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో వాడుకొని పలుమార్లు అత్యాచారం చేసి చివరికి రెండు కోట్లు కూడా దొబ్బేసాడంటూ ఆమె మొరపెట్టుకుంది. అయితే ఆమె బిగ్ బాస్ ఓటిటి లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే హరHARSHA SAI; YOUTUBER; MITRA SHARMA; BIGGBOSS OTT{#}johnny;mithra;Traffic police;Johnny;Police Station;BEAUTY;Father;prema;Bigboss;marriage;Love;Heroineబిగ్ బాస్ బ్యూటీని నమ్మించి రేప్ చేసిన హర్ష సాయి.. నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్..?బిగ్ బాస్ బ్యూటీని నమ్మించి రేప్ చేసిన హర్ష సాయి.. నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్..?HARSHA SAI; YOUTUBER; MITRA SHARMA; BIGGBOSS OTT{#}johnny;mithra;Traffic police;Johnny;Police Station;BEAUTY;Father;prema;Bigboss;marriage;Love;HeroineWed, 25 Sep 2024 08:32:38 GMTసినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరి భాగోతాలు బయటపడుతున్నాయి.మొన్నటి వరకు రాజకీయ నాయకుల వంతైతే ఇప్పుడు సినీ సెలెబ్రెటీల వంతయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్యనే జానీ మాస్టర్ బాగోతం బయటపడింది.అయితే తాజాగా నటుడు ఫేమస్ యూట్యూబర్ అయినటువంటి హర్ష సాయిపై ఓ యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో వాడుకొని పలుమార్లు అత్యాచారం చేసి చివరికి రెండు కోట్లు కూడా దొబ్బేసాడంటూ ఆమె మొరపెట్టుకుంది. అయితే ఆమె బిగ్ బాస్ ఓటిటి లో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే హర్ష సాయిని పెట్టి ఆ మధ్యకాలంలో ఓ సినిమాని కూడా తీసింది.ఆ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేసింది. బిగ్ బాస్ నుండి వచ్చాక ఓ ప్రైవేట్ పార్టీలో హర్ష సాయిని కలుసుకున్న ఆ బ్యూటీ  ఆ తర్వాత పరిచయం పెరగడంతో ఇద్దరు ఫోన్లు మాట్లాడుకోవడం,తరచూ కలవడంతో డేటింగ్ చేయడం వరకు వచ్చిందట.అలా ఇద్దరు పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి చేసుకునే వరకు వెళ్లారు. 

ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష సాయి చాలాసార్లు ఆమెను లైంగికంగా వాడుకున్నారట.అలాగే అవసరం నిమిత్తం రెండు కోట్ల రూపాయలు కూడా ఆ బాధిత యువతి నుండి తీసుకున్నారట. కానీ చివరికి పెళ్లి లేదు గిల్లీ లేదు అన్నట్లు ఆమెను మోసం చేసి పక్కన పెట్టేసారట.ఇక ఈ విషయంలో మోసపోయాను అని తెలుసుకున్న ఆ బిగ్ బాస్ బ్యూటీ వెంటనే నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి హర్ష సాయిపై ఆయన తండ్రి రాధాకృష్ణపై కేసు నమోదు చేసింది.అలాగే ఆమె తన ఫిర్యాదులో యూట్యూబర్ హర్ష సాయి తనను నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడని, లైంగికంగా వేధించాక నా నగ్న వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడని,ఈ విషయం ఎక్కడైనా చెబితే నీ ఫోటోలు వీడియోలన్నీ బయటికి వస్తాయని భయభ్రాంతులకు గురి చేశాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. 

అయితే ప్రస్తుతం యూట్యూబర్ హర్ష సాయి పై ఆ బిగ్ బాస్ బ్యూటీ కంప్లైంట్ ఇవ్వడంతో ఇది కాస్త బయటికి వచ్చి మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.అంతేకాదు ఇన్ని రోజులు పేదలకు సహాయం చేస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్న యూట్యూబర్ హర్ష సాయి అసలు నిజస్వరూపం ఇదా అంటూ చాలామంది జనాలు షాక్ అవుతున్నారు. అయితే హర్ష సాయి పై కేసు పెట్టింది బిగ్ బాస్ ఓటిటిలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మిత్ర శర్మ అని తెలుస్తోంది. మరి చూడాలి ఈ కేసులో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>