Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrc925fbd1-c67e-4baf-8fbf-64cd6e08444a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrc925fbd1-c67e-4baf-8fbf-64cd6e08444a-415x250-IndiaHerald.jpgదేవర దేవర దేవర.. ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా ఈ పేరే వినిపిస్తుంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ బాక్సాఫీస్ మొత్తంలో కూడా ఈ సినిమాకు ఏర్పడిన బజ్ అంతా కాదు. కొరటాల శివ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ.. ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల విడుదలైన ట్రైలర్ పాటలు ఈ అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం చేతుల బృందntr{#}Tollywood;Indian;Event;koratala siva;NTRవిడుదలకు ముందే.. నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెట్టిన దేవర.. అంతా ఫ్యాన్స్ వల్లే?విడుదలకు ముందే.. నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెట్టిన దేవర.. అంతా ఫ్యాన్స్ వల్లే?ntr{#}Tollywood;Indian;Event;koratala siva;NTRWed, 25 Sep 2024 10:30:00 GMTదేవర దేవర దేవర.. ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా ఈ పేరే వినిపిస్తుంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ బాక్సాఫీస్ మొత్తంలో కూడా ఈ సినిమాకు ఏర్పడిన బజ్ అంతా కాదు. కొరటాల శివ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ.. ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల విడుదలైన ట్రైలర్ పాటలు ఈ అంచనాలను రెట్టింపు చేశాయి.


 అయితే విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం చేతుల బృందం ప్రమోషన్స్ లో మునిగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తూ ఉంటే దేవర మూవీకి భారీగా ఓపెనింగ్స్ వస్తాయని.. నిర్మాతలకు లాభాల పంట పండుతుందని అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు. విడుదల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో కానీ విడుదలకు ముందే  నిర్మాతలకు చివరికి నష్టాలు వచ్చాయి. అదేంటి విడుదల అవ్వకముందు నష్టాలు ఎలా వస్తాయి అని అనుకుంటున్నారు కదా.


 ఇటీవలే దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో ఈవెంట్ నిర్వహించాలి అనుకున్నారు. కానీ రద్దు అయింది. దీనికి కారణం అభిమానులందరూ కూడా అంచనాలకు మించి రావడంతో వచ్చేవరికి ఈవెంట్ రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నిర్వాహకుల ప్రకటనతో అభిమానులు రెచ్చిపోయారు. గుంపుగా దూసుకువెళ్లడంతో అద్దాలు ఎలివేటర్  కూడా ధ్వంసం చేశారు. మొత్తంగా నిర్వహణ చార్జీలు కలుపుకొని 33 లక్షలు ఇవ్వాలంటూ నిర్మాతలను నోవాటెల్ హోటల్ యాజమాన్యం డిమాండ్ చేసింది. ఇలా దేవర విడుదలకు ముందే అటు ప్రొడ్యూసర్లకు నష్టం వాటిల్లింది. అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేయడంతో అటు అభిమానులు ఎంతో నిరాశకు గురై మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>