EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chaina869735a2-42ba-4c5a-8c20-e197dd4e652c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chaina869735a2-42ba-4c5a-8c20-e197dd4e652c-415x250-IndiaHerald.jpgప్రపంచంలోని అతి పెద్దదైన త్రీ గోర్జెస్ డ్యాం వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల భూ గమనంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇది శ్రేయస్కరం కాదని.. హెచ్చరిస్తున్నారు. చైనాలోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కి.మీ. పొడవు, 181 మీటర్ల ఎత్తుల్లో డ్యాం ను నిర్మించారు. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యంగ్జీ నదిలోకి పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గిపోయిందని అప్పట్లో శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు. అంతే కాకుండchaina{#}Aqua;Earhquake;Maha;American Samoa;NASA;Tsunamiవార్నీ.. వాతావరణంలో మార్పులకు చైనానే కారణమా? ఇతర దేశాలపై కుట్రకు డ్రాగన్ అంత పని చేసిందా?వార్నీ.. వాతావరణంలో మార్పులకు చైనానే కారణమా? ఇతర దేశాలపై కుట్రకు డ్రాగన్ అంత పని చేసిందా?chaina{#}Aqua;Earhquake;Maha;American Samoa;NASA;TsunamiWed, 25 Sep 2024 13:37:00 GMTప్రపంచంలోని అతి పెద్దదైన త్రీ గోర్జెస్ డ్యాం వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల భూ గమనంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇది శ్రేయస్కరం కాదని.. హెచ్చరిస్తున్నారు. చైనాలోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కి.మీ. పొడవు, 181 మీటర్ల ఎత్తుల్లో డ్యాం ను నిర్మించారు.


ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యంగ్జీ నదిలోకి పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గిపోయిందని అప్పట్లో శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు. అంతే కాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం రెండు సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు. దీని ప్రభావం ప్రస్తుతం ఇంకా పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


భూమిపై భారీ మొత్తంలో ఏమైనా మార్పుల చోటు చేసుకున్నప్పుడు దాని ప్రభావం భూ గమనంపై పడుతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతోంది. 2024లో హిందూ మహా సముద్రంలో భూకంపం సంభవించి సునామీ వచ్చినప్పుడు భూ గమనంలో మార్పు స్పష్టంగా కనిపించింది. దీని ప్రభావంతో రోజూ నిడివి సుమారు 2.68 మైక్రో సెకన్లు తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితి త్రీ గోర్డెస్ డ్యాం వల్ల కూడా కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



త్రీ గోర్డెస్ డ్యాం మూడు నదుల నుంచి నీరు వచ్చి చేరుతుంది. సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్ల నీరు డ్యాంలో నిల్వ ఉంటుంది. అంత భారీ మొత్తంలో ఒకేచోట నీరు చేరడం భూమిపై ప్రభావం చూపిస్తోంది. అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే అతి తక్కువ కట్టడాల్లో ఇది కూడా ఒకటి. ఈ డ్యాంలో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తు 22500 మెగా వాట్లు. అంటే ప్రపంచలోనే అతి పెద్దదైన మూడు అణు విద్యుత్తు కేంద్రాల ఉత్పత్తికి సమానం. ఈ డ్యాం నీటి నిల్ల కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పనులు 1994లో ప్రారంభించి.. 2006లో పూర్తి చేశారు. ఈ డ్యాం కోసం చైనా 114 పట్టణాలు, 1680 గ్రామాలను చైనా నేలమట్టం చేసింది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>