MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa-political-leade-torget-prakesh-raj-maro-twite62c577de-ab68-499e-af9f-5f0e9fe2ef5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa-political-leade-torget-prakesh-raj-maro-twite62c577de-ab68-499e-af9f-5f0e9fe2ef5f-415x250-IndiaHerald.jpgశ్రీవారి లడ్డు వ్యవహారం ఒకవైపు రచ్చ లేపుతుంటే మరొకవైపు నటుడు ప్రకాష్ రాజ్ కూడా వరుసగా ట్వీట్లు చేయడం చర్చనీయాంశంగా మారుతున్నది. లడ్డు వివాదం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ఒక పోస్టుని చేసిన తరువాత వరుసగా ట్వీట్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డు కల్తీ జరిగిందనే వ్యవహారం పైన ప్రకాష్ రాజ్ డిప్యూటీ సీఎం గా మీరు ఉన్నారు. ఇది నిజంగా జరిగిన ఘటన లేదా విచారించవచ్చు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేయడం జరిగింది. మీరు లేనిపోని భయాలను ప్రజలలో కల్పిస్తున్నారని ఇది జాతీయస్థాPRAKESH RAJ;KARTHI;PAWAN KALYAN;DUPUT CM AP{#}sathyam;Ladoo;Raccha;raj;Kollywood;Cinema;kalyan;Prakash Raj;Karthik Siva Kumar;CM;Deputy Chief Minister;News;Tirupati;Indiaఆ పొలిటికల్ లీడర్ టార్గెట్.. ప్రకాష్ రాజ్ మరో ట్విట్..!ఆ పొలిటికల్ లీడర్ టార్గెట్.. ప్రకాష్ రాజ్ మరో ట్విట్..!PRAKESH RAJ;KARTHI;PAWAN KALYAN;DUPUT CM AP{#}sathyam;Ladoo;Raccha;raj;Kollywood;Cinema;kalyan;Prakash Raj;Karthik Siva Kumar;CM;Deputy Chief Minister;News;Tirupati;IndiaWed, 25 Sep 2024 18:27:00 GMTశ్రీవారి లడ్డు వ్యవహారం ఒకవైపు రచ్చ లేపుతుంటే మరొకవైపు నటుడు ప్రకాష్ రాజ్ కూడా వరుసగా ట్వీట్లు చేయడం చర్చనీయాంశంగా మారుతున్నది. లడ్డు వివాదం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ఒక పోస్టుని చేసిన తరువాత వరుసగా ట్వీట్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డు కల్తీ జరిగిందనే వ్యవహారం పైన ప్రకాష్ రాజ్ డిప్యూటీ సీఎం గా మీరు ఉన్నారు. ఇది నిజంగా  జరిగిన ఘటన లేదా విచారించవచ్చు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేయడం జరిగింది. మీరు లేనిపోని భయాలను ప్రజలలో కల్పిస్తున్నారని ఇది జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారంటూ రాసుకురావడం జరిగింది.


పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నానని తెలియజేశారు. ప్రకాష్ రాజ్ పోస్ట్ పైన మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇలాంటి అంశాలను తెలుసుకొని మాట్లాడాలని సనాతన ధర్మం పైన ఎవరైనా మాట్లాడితే అసలు ఊరుకునేది లేదంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజ్ అంటే తనకు చాలా రెస్పెక్ట్ ఉందంటూ కూడా కౌంటర్ వేశారు.. అయితే ఈరోజు ఉదయం ప్రకాశ్ రాజ్ తాను విదేశాలలో ఉన్నానని ఇండియా వరకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తానంటూ తెలియజేశారు. ఒకవేళ తమకు వీలు ఉంటే మళ్ళీ ట్వీట్ చదవండి అంటూ కోరారు ప్రకాష్ రాజ్.


అయితే ఇప్పుడు మళ్లీ తెలుగులో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. చేయని తప్పుకు సారి చెప్పించుకోవడంలో అసలు ఆనందమేంటో..అంటూ జస్ట్ ఆస్కింగ్ అనే ఒక పదాన్ని రాసుకొస్తు ట్వీట్ చేశారు.. ఇది డిప్యూటీ సీఎంనే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. కోలీవుడ్ హీరో కార్తీ సారీ చెప్పిన విషయాన్ని ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఇలా నేటిజన్ల ముందుకు తీసుకువచ్చారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. సత్యం సుందరం సినిమా ఈవెంట్లో లడ్డు కావాలా నాయనా అనే అంశాన్ని చూపించారు. దీంతో కార్తి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అని నవ్వుతూ ఆపివేయమని చెప్పారు.. ఈ విషయం పైన పవన్ స్పందించగా.. ఈ విషయంపై కూడా కార్తి క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొకసారి కార్తీ వివాదాన్ని తెర లేపినట్టుగా కనిపిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>