MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara2e569d1c-9162-4548-8483-a0d3d28f5d3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara2e569d1c-9162-4548-8483-a0d3d28f5d3d-415x250-IndiaHerald.jpg థియేటర్‌లు అన్ని ప్రేక్షకుల లేక వెలవెల‌ పోయాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతుండడంతో అన్ని థియేటర్లు కళకళలాడుతున్నాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర జాతర వాతావరణం నెలకొంది. చాలా రోజుల తర్వాత థియేటర్లలో భారీ బుకింగ్స్.. దేవర సినిమా కోసం చూస్తున్నాం. devara{#}NTR;Cinema;Tollywood' దేవ‌ర ' - స‌త్యం సుంద‌రం సినిమాల‌కు సేమ్ టు సేమ్ ఈ పోలిక చూశారా..?' దేవ‌ర ' - స‌త్యం సుంద‌రం సినిమాల‌కు సేమ్ టు సేమ్ ఈ పోలిక చూశారా..?devara{#}NTR;Cinema;TollywoodWed, 25 Sep 2024 11:01:00 GMTటాలీవుడ్‌లో చాలా కాలం తర్వాత థియేటర్లలో కళ కనిపిస్తోంది. ఈ సంక్రాంతి వచ్చిన సినిమాల తర్వాత దాదాపు 7 - 8 నెలలపాటు మధ్యలో ఒకటి రెండు సినిమాలు మిన‌హాయిస్తే.. థియేటర్‌లు అన్ని ప్రేక్షకుల లేక వెలవెల‌ పోయాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతుండడంతో అన్ని థియేటర్లు కళకళలాడుతున్నాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర జాతర వాతావరణం నెలకొంది. చాలా రోజుల తర్వాత థియేటర్లలో భారీ బుకింగ్స్.. దేవర సినిమా కోసం చూస్తున్నాం.


మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన భారీ సినిమా దేవర గ్రాండ్‌గా ఈ వారంలో థియేటర్స్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ శుక్రవారం సెప్టెంబర్ 27న పాన్ ఇండియా భాషలలో దేవర వస్తుండగా ఈ సినిమాతో పాటు.. టాలెంటెడ్ నటుడు కార్తీక్ నటించిన సినిమా సత్యం సుందరం కూడా థియేటర్లలో ఈ వారంలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే సత్యం సుందరం తమిళంలో దేవర తోనే రిలీజ్ అవుతున్నా.. తెలుగులో ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ అవుతుంది.


అయితే ఈ శుక్రవారం ధియేటర్లలో దిగుతున్న ఈ రెండు సినిమాలలో ఒక కామన్ పోలిక ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఒకే రన్ టైమ్‌తో ఈ రెండు సినిమాలు రావడం కాకతాళీయం. అది కూడా భారీ రన్ టైం తో ఈ సినిమాలు వస్తున్నాయి. యాక్షన్ డ్రామా దేవర.. 2 గంటల 57 నిమిషాల నడివితో వస్తుంది. ఇక‌ కార్తీ క్లీన్ ఎమోషనల్ డ్రామా సత్యం సుందరం కూడా.. 2 గంటల 57 నిమిషాల నిడివితో రాబోతుంది. ఇలా రెండు సినిమాలు కూడా ఒకే రన్ టైం తో ఫ్రైడే రిలీజ్ కి రావడం ఒకింత ఇంట్రెస్టింగ్. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>