PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jamili-elections-modi-india-ramnath-kovindc5534e97-2104-4e19-bd7e-01a01c45760d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jamili-elections-modi-india-ramnath-kovindc5534e97-2104-4e19-bd7e-01a01c45760d-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే నిర్ణయం వెనుక దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది. 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలు 1967లో జరిగినటువంటి నాలుగవ సార్వత్రిక ఎన్నికల వరకు ఇండియాలో జమిలి ఎన్నికలు జరిగాయి. పార్లమెంటుకు,అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. ఇక 1972లో జరపాల్సిన ఐదవ సార్వత్రిక ఎన్నికలు 1971 లోనే జరగడంతో జమిలి ఎన్నికల ప్రక్రియ కి బ్రేక్ పడింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నికలు ఒకేసారి జరగడం ఆగిపోయింది. అలాంటి పద్ధతిని మళ్లీ పునరుద్ధరించాలని పJAMILI ELECTIONS; MODI; INDIA; RAMNATH KOVIND{#}Manam;Ram Nath Kovind;local language;Party;Government;Bharatiya Janata Party;Electionsజమిలి ఎన్నికల గోల: హిట్లర్ పాలన రిపీట్ అవుతుందా.?జమిలి ఎన్నికల గోల: హిట్లర్ పాలన రిపీట్ అవుతుందా.?JAMILI ELECTIONS; MODI; INDIA; RAMNATH KOVIND{#}Manam;Ram Nath Kovind;local language;Party;Government;Bharatiya Janata Party;ElectionsWed, 25 Sep 2024 09:59:00 GMT-దేశాన్ని కబలించబోతున్న జమిలి..
- ప్రశ్నించే గొంతులను నొక్కాడమే ఈ ఎన్నికలా.?
- హిట్లర్ పాలన చూడబోతున్నామా.?.

 ప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా జమిలి ఎన్నికల టాపికే వినిపిస్తోంది. అసలు ఈ జమిలి ఎన్నికలు అంటే ఏంటి.. దీనివల్ల దేశానికి నష్టమా.. లాభమా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదం అసలు బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిందా ఇదివరకు దేశంలో జరిగిందా.. జెమిలీ ఎన్నికల వల్ల పాలన ఎలా ఉండబోతోంది అనే వివరాలు చూద్దాం.

 జమిలి వణుకు :
కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే నిర్ణయం వెనుక దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది. 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలు 1967లో జరిగినటువంటి  నాలుగవ సార్వత్రిక ఎన్నికల వరకు ఇండియాలో జమిలి ఎన్నికలు జరిగాయి. పార్లమెంటుకు,అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. ఇక 1972లో జరపాల్సిన ఐదవ సార్వత్రిక ఎన్నికలు 1971 లోనే జరగడంతో జమిలి ఎన్నికల ప్రక్రియ కి బ్రేక్ పడింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నికలు ఒకేసారి జరగడం ఆగిపోయింది.  అలాంటి పద్ధతిని మళ్లీ పునరుద్ధరించాలని ప్రస్తుతం ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనికోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కొన్ని కమిటీలను కూడా వేసింది. అయితే ఈ బిల్లును వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ జమిలిలో పార్లమెంటు,అసెంబ్లీయే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా 100 రోజుల్లో ముగించాలి. 

ఈ జమిలి ఎన్నికల వల్ల ఏర్పడిన ప్రభుత్వాలు పడిపోతే ఉప ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తారు. ఒకవేళ ప్రభుత్వం రెండేళ్ల పాలన తర్వాత పడిపోతే మళ్ళీ మూడేళ్ల పాలన కోసం మాత్రమే ఎన్నికలు జరిపిస్తారు. అందులో గెలిచినవారు మూడేళ్లు మాత్రమే పాలన చేయాలి. ఈ విధంగా జమిలి ఎన్నికలు జరిగితే ఒకేసారి ప్రభుత్వాలన్నీ ఒకేరోజు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఒకవేళ దేశం మొత్తం ఒకే పార్టీ గెలిస్తే, వారికి నచ్చిన విధంగా పాలన చేస్తారు. వారు ఏదంటే అది తప్పనిసరిగా  చేసేస్తారు. ఇందులో ప్రజాభిప్రాయాల గురించి ఏమి పట్టించుకోరు. ఒకవేళ కొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీలు ఏర్పడిన అవి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో  తప్పనిసరిగా పొత్తు పెట్టుకోవాల్సిందే. వారు చెప్పిన మాట వినాల్సిందే. లేదంటే ఆ రాష్ట్ర అభివృద్ధి వెనుకబడి పోయే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల వల్ల ఎటు చూసినా పేద ప్రజలకు నష్టం తప్ప రాజకీయ నాయకులకు అయ్యేదేం ఉండదు. దానికి ఒకే దేశం ఒకే ఎన్నిక జరిగితే మాత్రం మనం హిట్లర్ పాలన చూస్తామని కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ ఎన్నిక సాధ్యమవుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>