PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu52367ed1-40e1-4f29-b354-c42ed062f9c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu52367ed1-40e1-4f29-b354-c42ed062f9c5-415x250-IndiaHerald.jpgకొద్ది రోజుల క్రితం రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్ రావు - మోపిదేవి వెంకట రమణ తమ పదవులకు రాజీనామా చేయడంతో పాటు వైసిపికి కూడా గుడ్ బై చెప్పేసారు. తాజాగా తెలంగాణకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇది వైసీపీకి మరో గట్టి ఎదురు దెబ్బ. Chandrababu{#}CBNఆర్‌. కృష్ణ‌య్య‌కు ప‌వ‌న్ - చంద్ర‌బాబు థ్యాంక్స్ చెప్పాల్సిందే...!ఆర్‌. కృష్ణ‌య్య‌కు ప‌వ‌న్ - చంద్ర‌బాబు థ్యాంక్స్ చెప్పాల్సిందే...!Chandrababu{#}CBNWed, 25 Sep 2024 13:46:00 GMTవైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. రాజ్యసభ ఎంపీలు కూడా ఒక‌రి త‌ర్వాత‌ ఒకరు రాజీనామా చేస్తుండడంతో పార్టీకి రాజకీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కొద్ది రోజుల క్రితం రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్ రావు - మోపిదేవి వెంకట రమణ తమ పదవులకు రాజీనామా చేయడంతో పాటు వైసిపికి కూడా గుడ్ బై చెప్పేసారు. తాజాగా తెలంగాణకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇది వైసీపీకి మరో గట్టి ఎదురు దెబ్బ.


గతంలో ఆ పార్టీకి రాజ్యసభలో బలమైన సంఖ్యా బలం ఉంది. ఇప్పుడు ఎంపీలు వరుస పెట్టి రాజీనామా చేస్తుండడం పార్టీకి మైనస్ గా మారింది. విచిత్రం ఏంటంటే కృష్ణయ్య రాజ్యసభ పదవి వదులుకోవటం నిజంగా చంద్రబాబు - పవన్ కళ్యాణ్ కు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆయనకు మరో నాలుగేళ్ల పాటు పదవీకాలం ఉంది. రాజ్యసభ చైర్మన్ కూడా కృష్ణయ్య రాజీనామాను ఆమోదించారు. త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ సీటును కచ్చితంగా కూటమి దక్కించుకోనుంది. కూటమిలో తెలుగుదేశం లేదా జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా కృష్ణయ్య స్థానంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం కచ్చితంగా కూటమి ఖాతాలో పడుతుంది.


ఈ రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ఏకంగా నాలుగు సంవ‌త్స‌రాలు ఉంది. కూట‌మి నుంచి ఎంపికయ్యే రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎవ‌రైనా ఏకంగా నాలుగేళ్ల పాటు హ్యాపీగా ప‌ద‌విలో ఉండ‌నున్నారు. అలాగే నాలుగేళ్ల పాటు టీడీపీ ఖాతాలో లేదా కూట‌మి పార్టీల‌లో ఎవ‌రో ఒక‌రికి నాలుగేళ్ల రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ద‌క్క‌నుంది. ఇది నిజంగా బాబు - ప‌వ‌న్ కృష్ణ‌య్య‌కు హ్యాట్సాఫ్ చెప్పుకునే సంద‌ర్భ‌మే అనుకోవాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>