PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jamili-electionsec66bbc9-706d-4c6b-ac9f-6f0c2c6d3c67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jamili-electionsec66bbc9-706d-4c6b-ac9f-6f0c2c6d3c67-415x250-IndiaHerald.jpgదేశంలో జమిలి ఎన్నికలపై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికలను ఇంప్లిమెంట్ చేయాలంటే మోదీ సర్కార్ పలు సవాళ్లను అధిగమించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎలక్షన్స్ పెట్టాలంటే 6 రాజ్యాంగ సవరణలు కూడా చేయాలి. ఈ సవరణలకు ఆమోదముద్ర పడాలంటే కనీసం సగం రాష్ట్రాల కులంగా ఓటు వేయాలి. ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్డీయే ప్రభుత్వం చాలా వీక్ గా ఉంది. ఎన్డీయే సర్కార్‌ ఏ మార్పును సొంతంగా తీసుకురాలేదు. జమిలి ఎన్నికల కోసం వేరే ఎంపీల సపోర్టు కూడా తీసుకోవాల్సి వస్తుంది. Jamili elections{#}Narendra Modi;Parliament;Election;Assembly;MP;Elections;Governor;India;Rajya Sabha;Governmentజమిలి ఎన్నికలకు ఈ రాజ్యాంగ సవరణలు అవసరమా..జమిలి ఎన్నికలకు ఈ రాజ్యాంగ సవరణలు అవసరమా..Jamili elections{#}Narendra Modi;Parliament;Election;Assembly;MP;Elections;Governor;India;Rajya Sabha;GovernmentWed, 25 Sep 2024 09:20:00 GMT* జమిలి ఎన్నికలకు ముందు ఎన్నో సవాళ్లు  

* రాజ్యాంగ సవరణలు కూడా చాలా అవసరమే

* ఎన్డీయే సర్కార్ ఏం చేయబోతోంది

( భారత్ - ఇండియా హెరాల్డ్)

దేశంలో జమిలి ఎన్నికలపై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికలను ఇంప్లిమెంట్ చేయాలంటే మోదీ సర్కార్ పలు సవాళ్లను అధిగమించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎలక్షన్స్ పెట్టాలంటే 6 రాజ్యాంగ సవరణలు కూడా చేయాలి. ఈ సవరణలకు ఆమోదముద్ర పడాలంటే కనీసం సగం రాష్ట్రాల కులంగా ఓటు వేయాలి. ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్డీయే ప్రభుత్వం చాలా వీక్ గా ఉంది. ఎన్డీయే సర్కార్‌ ఏ మార్పును సొంతంగా తీసుకురాలేదు. జమిలి ఎన్నికల కోసం వేరే ఎంపీల సపోర్టు కూడా తీసుకోవాల్సి వస్తుంది.

జమిలి అంటే ఎంపీ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి కండక్ట్ చేయడం. 1951-1967 మధ్యకాలంలో మన ఇండియాలో దేశవ్యాప్తంగా జమిలి ఎలక్షన్స్ జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కుప్పకూలడం జరిగింది ఫలితంగా మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అలా అసెంబ్లీల ఎన్నికల డేట్ అనేది మారిపోయింది. జమిలి కూడా అంతరించిపోయింది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారిపోయాయి. ఇప్పుడు కూడా ఒక రాష్ట్రంలో ఒక్కో సమయాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జమిలి ఎన్నికలు పెట్టాలంటే, రానున్న సార్వత్రిక ఎన్నికలతో చేర్చాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచాలి మరికొన్నిటిని తగ్గించాలి.

లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ పని చేయాల్సిందే. ఈ పనులు వల్ల రాజ్యాంగ పరంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దేశంలో వివిధ ఎన్నికలకు సంబంధించి 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలో అమెండమెంట్స్ చేయాలి. అలానే పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు అమల్లోకి రావాలంటే మొదటగా 6 రాజ్యాంగ సవరణలు చేయాలి. ఇవి చేయకపోతే ఆ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండదు.

* 6 సవరణలు

- ఆర్టికల్ 83(2): అత్యవసర పరిస్థితుల్లో పార్లమెంటు లోక్‌సభ, రాజ్యసభ పదవీకాలాన్ని ఒక సంవత్సరం వరకు పొడిగించేలా మార్చాలి.

- ఆర్టికల్ 85(2)(బి): లోక్‌సభను రద్దు చేసే రాష్ట్రపతి అధికారాన్ని సవరించాలి.

- ఆర్టికల్ 172(1): రాష్ట్ర అసెంబ్లీలకు ఐదేళ్ల కాలపరిమితిని సవరించాలి.

- ఆర్టికల్ 174(2)(బి): రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే గవర్నర్ అధికారాన్ని మార్చాలి.

- ఆర్టికల్ 356: రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన నిబంధనలను అప్‌డేట్ చేయాలి.

- ఆర్టికల్ 324: ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన నిబంధనలను సవరించాలి.

ఈ సవరణలను పార్లమెంటులో 2/3వ వంతు ఎంపీలు ఆమోదం తెలపాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>