Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/----8080bfcf-45a3-45da-8278-6ceea32b9ad2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/----8080bfcf-45a3-45da-8278-6ceea32b9ad2-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రికెట్లో బ్యాటర్లు ఎన్నో విధాలుగా ఔట్ అవుతూ ఉంటారు. కొంతమంది బౌల్డ్, అయితే ఇంకొంతమంది ఎల్బీడబ్ల్యు ద్వారా అవుట్ అవుతుంటారు. ఇంకొంతమంది క్యాచ్ అవుట్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. అయితే అటు బ్యాట్స్మెన్లను ఎక్కువగా నిరాశకు గురి చేసేది ఎక్కువగా బాధ పెట్టేది ఎలాంటి అవుట్ అంటే అందరూ రన్ అవుట్ అని చెబుతారు. ఎందుకంటే ప్రమేయం లేకుండానే రన్ అవుట్ జరిగిపోతూ ఉంటుంది. దీంతో గ్రౌండ్ లోకి అత్యుత్తమ ప్రదర్శన చేయాలని వచ్చిన ఆటగాడు.. చివరికి రన్ అవుట్ ద్వారా నిరాశతోనే వెను తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుక్రికెట్{#}Afghanistan;Parugu;Yevaruబ్యాడ్ లక్ అంటే ఇతనిదే.. ఇలా ఎవరు ఔట్ అయి ఉండరు?బ్యాడ్ లక్ అంటే ఇతనిదే.. ఇలా ఎవరు ఔట్ అయి ఉండరు?క్రికెట్{#}Afghanistan;Parugu;YevaruTue, 24 Sep 2024 20:00:00 GMTసాధారణంగా క్రికెట్లో బ్యాటర్లు ఎన్నో విధాలుగా ఔట్ అవుతూ ఉంటారు. కొంతమంది బౌల్డ్, అయితే ఇంకొంతమంది ఎల్బీడబ్ల్యు ద్వారా అవుట్ అవుతుంటారు. ఇంకొంతమంది క్యాచ్ అవుట్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. అయితే అటు బ్యాట్స్మెన్లను ఎక్కువగా నిరాశకు గురి చేసేది ఎక్కువగా బాధ పెట్టేది ఎలాంటి అవుట్ అంటే అందరూ రన్ అవుట్ అని చెబుతారు. ఎందుకంటే ప్రమేయం లేకుండానే రన్ అవుట్ జరిగిపోతూ ఉంటుంది. దీంతో గ్రౌండ్ లోకి అత్యుత్తమ ప్రదర్శన చేయాలని వచ్చిన ఆటగాడు.. చివరికి రన్ అవుట్ ద్వారా నిరాశతోనే వెను తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది.


 అయితే ఇతరుల కారణంగా రన్ అవుట్ అవ్వడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక బ్యాట్స్మెన్ మాత్రం అతని కారణంగా అతని రన్ అవుట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా, ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఇలాంటి ఆసక్తికర ఘటన జరిగింది. మూడో వన్డే మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు రహ్మత్ షా. కాని ఊహించని విధంగా అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ తొమ్మిదవ ఓవర్లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడి వేసిన బంతిని


 గుర్బాజ్ మిడ్ ఆన్ దిశగా ఆడాడు. అయితే దూరంగా వెళుతున్న ఆ బంతిని అందుకోవడంలో ఎంగిడి విఫలమయ్యాడు. దీంతో ఈ బంతి నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న రహమత్ షా భుజానికి తగిలింది. ఇక అతను పరుగు కోసం ప్రయత్నిస్తూ క్రీజ్ దాటడంతో ఇక అంతలోనే బంతి వెళ్లి నేరుగా వికెట్లకు తగిలింది. దీంతో చివరికి అనుకోని విధంగా అతను వికెట్ కోల్పోయాడు. చివరికి నిరాశతో పెవీలియన్ చేరాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.. ఇతను నిజంగా దురదృష్టవంతుడు. క్రికెట్లో ఇలా ఎవరు ఔట్ అవ్వరెమో అంటూ అందరూ కామెంట్ చేస్తూ ఉన్నారు.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>