MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr592497ff-083f-46f3-bc6d-fcaa91c1e401-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr592497ff-083f-46f3-bc6d-fcaa91c1e401-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ సోలో గా సింగిల్ గా వెండి తెర మీద క‌నిపించి ఐదున్న‌ర సంవ‌త్స‌రాలు అవుతోంది. 2018 లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ త‌ర్వాత ఎన్టీఆర్ మ‌ళ్లీ సోలో హీరోగా సినిమా చేయ‌లేదు. మ‌ధ్య‌లో త్రిబుల్ ఆర్ వ‌చ్చినా అది రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి చేసిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ. అందులోనూ ఆ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కావ‌డంతో చాలా వ‌ర‌కు క్రెడిట్ ఆయ‌న ఖాతాలో కూడా ప‌డింది. ఇక ఇప్పుడు దేవ‌ర సినిమా వ‌స్తోంది. ntr{#}NTR;Jr NTR;Tollywood;CinemaRRR - దేవ‌ర బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎన్టీఆర్ బ్లాస్టింగ్ రికార్డ్‌... !RRR - దేవ‌ర బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎన్టీఆర్ బ్లాస్టింగ్ రికార్డ్‌... !ntr{#}NTR;Jr NTR;Tollywood;CinemaTue, 24 Sep 2024 16:21:51 GMTమన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ .. టాలీవుడ్ యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేసిన భారీ పాన్ ఇండియా సినిమా దేవ‌ర‌. ఈ సినిమా మ‌రో రెండు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు పాన్ ఇండియా భాష‌ల‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కోసం  అభిమానులు ఎన్నో నెలల తరబడి ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఫైనల్ గా ఆ సమయం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది.


ఎన్టీఆర్ సోలో గా సింగిల్ గా వెండి తెర మీద క‌నిపించి ఐదున్న‌ర సంవ‌త్స‌రాలు అవుతోంది. 2018 లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ త‌ర్వాత ఎన్టీఆర్ మ‌ళ్లీ సోలో హీరోగా సినిమా చేయ‌లేదు. మ‌ధ్య‌లో త్రిబుల్ ఆర్ వ‌చ్చినా అది రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి చేసిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ. అందులోనూ ఆ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు కావ‌డంతో చాలా వ‌ర‌కు క్రెడిట్ ఆయ‌న ఖాతాలో కూడా ప‌డింది. ఇక ఇప్పుడు దేవ‌ర సినిమా వ‌స్తోంది.


ఎన్టీఆర్ కి మాస్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అందరికీ తెలుసు. మరి ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా భారీ లెవెల్లో ఉంది. ఈ సినిమా ఇప్ప‌టికే రిలీజ్ కు మ‌రో రెండు రోజుల టైం ఉండ‌గానే 2 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో కి చేరిపోయింది. ప్రీ సేల్స్ ద్వారా 2 మిలియ‌న్ డాల‌ర్లు అంటే మామూలు విష‌యం కాదు.


అలాగే ఎన్టీఆర్ అదిరిపోయే రికార్డ్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలుగా 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని నార్త్ అమెరికా మార్కెట్ లో కొట్టిన రెండో హీరోగా తారక్ RRR, దేవర సినిమాలతో నిలిచాడు. మరి దీనికి ముందు ప్రభాస్ నటించిన భారీ చిత్రాలు సలార్ - కల్కి 2898 ఎడి ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>