PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/america-sarkar7c454d29-de50-4421-9b07-c2a2eaaace9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/america-sarkar7c454d29-de50-4421-9b07-c2a2eaaace9f-415x250-IndiaHerald.jpgఅమెరికాలో చదువుకోవాలని అమెరికాలో ఉద్యోగం చేయాలని ఎంతోమంది కలలు కంటారు. అయితే కన్న కలలు నిజం కావడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. ఊహ తెలియని వయస్సులోనే పేరెంట్స్ తో కలిసి అమెరికాలో అడుగు పెట్టి అక్కడే చదువుకుని ఉద్యోగాలు సాధించిన విదేశీ యువతకు అమెరికా సర్కార్ షాకిస్తోంది. అమెరికా సర్కార్ 21 సంవత్సరాలు నిండిన వాళ్లు తమ దేశం వదిలి వెళ్లిపోవాలని సూచిస్తోంది. america sarkar{#}Letter;Nijam;News;job;American Samoa;Indiaవిదేశీ యువతకు షాకులిస్తున్న అమెరికా సర్కార్.. పెద్దయ్యారు వెళ్లిపోండంటూ?విదేశీ యువతకు షాకులిస్తున్న అమెరికా సర్కార్.. పెద్దయ్యారు వెళ్లిపోండంటూ?america sarkar{#}Letter;Nijam;News;job;American Samoa;IndiaTue, 24 Sep 2024 08:40:00 GMTఅమెరికాలో చదువుకోవాలని అమెరికాలో ఉద్యోగం చేయాలని ఎంతోమంది కలలు కంటారు. అయితే కన్న కలలు నిజం కావడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. ఊహ తెలియని వయస్సులోనే పేరెంట్స్ తో కలిసి అమెరికాలో అడుగు పెట్టి అక్కడే చదువుకుని ఉద్యోగాలు సాధించిన విదేశీ యువతకు అమెరికా సర్కార్ షాకిస్తోంది. అమెరికా సర్కార్ 21 సంవత్సరాలు నిండిన వాళ్లు తమ దేశం వదిలి వెళ్లిపోవాలని సూచిస్తోంది.
 
అమెరికా ప్రభుత్వం ఆంక్షలతో కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దేశం వదిలి స్వదేశానికి వెళ్తున్నారు. అమెరికా అధ్యక్ష కార్యాలయం లెక్కల ప్రకారం ఇలాంటి వాళ్ల జాబితా 2.5 లక్షలుగా ఉందని సమాచారం అందుతోంది. డిపెండెండ్ వీసాపై అమెరికాకు వెళ్లి తల్లీదండ్రులకు గ్రీన్ కార్డ్ రాకుండా 21 సంవత్సరాలు నిండిన యువత అమెరికా విడిచి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.
 
తల్లీదండ్రులకు హెచ్1 బీ వీసాలు ఉన్న పిల్లలు సైతం భారత్ కు వచ్చి బంధువుల దగ్గర ఉంటున్నారు. అనుభవం ఉన్న ఉద్యోగులకు సైతం తమ దేశం వదిలి వెళ్లాలంటూ అమెరికా ప్రభుత్వం షాక్ ఇస్తుండటం కొసమెరుపు. పిల్లలకు 21 ఏళ్లు వచ్చే సమయానికి తల్లీదండ్రులకు గ్రీన్ కార్డ్ వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అలా జరగకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
 
అమెరికాలో మన దేశానికి చెందిన వాళ్లు ఏకంగా 10 లక్షల మంది అక్కడ గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. లక్షలమంది యువతపై వీసా వేటు పడుతున్న నేపథ్యంలో వాళ్లను ఆదుకోవాలని అక్కడి పార్టీలు బైడెన్ సర్కార్ కు లేఖ రాశాయి. అయితే ఆ విజ్ఞప్తి కొలిక్కి రావడం లేదని సమాచారం అందుతోంది. నిపుణులైన యువతను కోల్పోయే దిశగా అమెరికా అడుగులు పడటంపై విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. అమెరికా సర్కార్ నిర్ణయాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>