PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan346aa038-0e6c-469e-b937-e357b6529043-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan346aa038-0e6c-469e-b937-e357b6529043-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని.. ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల నేతలు అనుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత... జగన్మోహన్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఏపీలో 11 స్థానాలే రావడం... అదే సమయంలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం జరిగింది. jagan{#}Kumaar;Telugu Desam Party;Janasena;Nellore;P Anil Kumar Yadav;anil kumar singhal;politics;Minister;TDP;MLA;YCP;Reddyజగన్ కు అనిల్ వెన్నుపోటు..జనసేనతో ఫిక్సింగ్ ?జగన్ కు అనిల్ వెన్నుపోటు..జనసేనతో ఫిక్సింగ్ ?jagan{#}Kumaar;Telugu Desam Party;Janasena;Nellore;P Anil Kumar Yadav;anil kumar singhal;politics;Minister;TDP;MLA;YCP;ReddyTue, 24 Sep 2024 07:35:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని.. ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల నేతలు అనుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత... జగన్మోహన్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఏపీలో 11 స్థానాలే రావడం... అదే సమయంలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం జరిగింది.

దానికి తోడు ఓటమి బాధలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని వీడి చాలామంది నేతలు... టిడిపి లేదా జనసేన పార్టీలోకి వెళ్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో.. వైయస్ జగన్మోహన్ రెడ్డికి..  మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వెన్నుపోటు పొడిచినట్లు స్వయాన ఆయన సొంత బాబాయి, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్... ఆరోపణలు చేయడం జరిగింది. నెల్లూరులో వైసీపీ పార్టీని నాశనం చేసిందే... అనిల్ కుమార్ యాదవ్ అంటూ ఆయన బాంబు పేల్చారు.

 
ఎక్కడో ఉండేవాణ్ణి ఇక్కడికి తీసుకువచ్చి ఎమ్మెల్యేగా రెండుసార్లు చేశామని.. రూప్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  చాలామంది నేతలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారని.. అందులో భాగంగానే కార్పొరేటర్లు కూడా టిడిపిలోకి చేరిపోయారని తెలిపారు. ఈ సమయంలోనే.. వైసిపి నేతలను.. జనసేన పార్టీలోకి వెళ్లాలని అనిల్ కుమార్ యాదవ్... సూచిస్తున్నారని.. సంచలన ఆరోపణలు చేశారు నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.

 
కొంతమంది నేతలను చెన్నైలో.. ఉంచి ఆ తర్వాత జనసేనలోకి వెళ్లేలా అనిల్ కుమార్ యాదవ్... ప్లాన్ చేస్తున్నారని కూడా తెలిపారు. ఇలా జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వెన్నుపోటు పొడుస్తున్నారని..  ఈ విషయాన్ని వైసిపి పార్టీ గ్రహిం చాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు... ప్రస్తుత మంత్రి నారాయణ పై అనేక రకాల.. తప్పుడు కేసులు అనిల్ కుమార్ యాదవ్ వేయించారని కూడా గుర్తు చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>