PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddyda795e31-de8e-4540-8bf7-3fed9e1eb53b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddyda795e31-de8e-4540-8bf7-3fed9e1eb53b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రకటించిన హామీలను.. అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా కష్టపడుతోంది.. అదే సమయంలో రేవంత్ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలు అయిపోయింది. దీనికి తగ్గట్టుగానే.. రేవంత్ రెడ్డికి ప్రతిసారి.. కౌంటర్ ఇస్తూ గులాబీ పార్టీ దూసుకు వెళ్తోంది. బలమైన ప్రతిపక్షం ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. revanth reddy{#}revanth;vishwa;Revanth Reddy;Congress;Backward Classes;Kamareddy;politics;srinivas;Party;Telangana;Delhi;CM;Telangana Chief Minister;Reddy;Newsరేవంత్ రెడ్డి సీటు లాగేసుకుతున్న మల్లన్న ?రేవంత్ రెడ్డి సీటు లాగేసుకుతున్న మల్లన్న ?revanth reddy{#}revanth;vishwa;Revanth Reddy;Congress;Backward Classes;Kamareddy;politics;srinivas;Party;Telangana;Delhi;CM;Telangana Chief Minister;Reddy;NewsTue, 24 Sep 2024 11:00:00 GMTప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రకటించిన హామీలను.. అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా కష్టపడుతోంది.. అదే సమయంలో రేవంత్ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలు అయిపోయింది. దీనికి తగ్గట్టుగానే.. రేవంత్ రెడ్డికి ప్రతిసారి.. కౌంటర్ ఇస్తూ గులాబీ పార్టీ దూసుకు వెళ్తోంది. బలమైన ప్రతిపక్షం ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది.

 
అయితే ఇలాంటి నేపథ్యంలో పానకంలో పుడకలాగా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పెను సంచలనాన్ని సృష్టిస్తున్నారు.  రేవంత్ రెడ్డి ఇకపై ముఖ్యమంత్రి కాబోడని..తెలంగాణకు ఇక బిసి సామాజిక వర్గానికి చెందిన వాడే ముఖ్యమంత్రి అవుతాడని తీన్మార్ మల్లన్న తాజాగా ప్రకటించారు.  లేటెస్ట్ గా  బీసీ సంక్షేమ సంఘం సదస్సుకు హాజరైన తీన్మార్ మల్లన్న.. రేవంత్ రెడ్డి పై అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


అన్ని పార్టీలు బీసీలను వాడుకొని.. రెడ్డిలు అలాగే రావులకు అధికారం కట్టబెడుతున్నాయని ఆయన మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఫైల్ రేవంత్ రెడ్డి దగ్గరే ఉందని.. దానిపైన సంతకం చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆ ఫైల్ పైన సంతకం చేయకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

 
2028 లో ఖచ్చితంగా బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని కూడా ప్రకటించారు తీన్మార్ మల్లన్న. దీంతో రేవంత్ రెడ్డి వర్గంలో కొత్త  అలజడి మొదలైంది. అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే ఉత్తంకుమార్ రెడ్డి  లు సీఎం పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఈ ఇద్దరు మంత్రులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు సమాచారం అందు తుంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>