MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devraaaefb51c2-1406-4964-8e28-e5985f8d6b97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devraaaefb51c2-1406-4964-8e28-e5985f8d6b97-415x250-IndiaHerald.jpgవారం రోజుల ముందే దేవర చలిజ్వరం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా కూడా మొదలైపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర' చిత్రంపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే కసితో, పట్టుదలతో, ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో అంతకు మించిన హిట్ సొంతం చేసుకోవాలని ఆశ పడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. పైగా వీరిద్దరి కాంబోలో జనdevraa{#}RRR Movie;Blockbuster hit;Chitram;American Samoa;Jr NTR;vegetable market;News;koratala siva;NTR;Telugu;Cinemaజోరుమీదున్న దేవర... కళ్ళు చెదిరే తాజా రికార్డ్ ఇదే!జోరుమీదున్న దేవర... కళ్ళు చెదిరే తాజా రికార్డ్ ఇదే!devraa{#}RRR Movie;Blockbuster hit;Chitram;American Samoa;Jr NTR;vegetable market;News;koratala siva;NTR;Telugu;CinemaTue, 24 Sep 2024 13:00:00 GMTవారం రోజుల ముందే దేవర చలిజ్వరం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా కూడా మొదలైపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర' చిత్రంపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే కసితో, పట్టుదలతో, ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో అంతకు మించిన హిట్ సొంతం చేసుకోవాలని ఆశ పడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. పైగా వీరిద్దరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి పెద్ద హిట్ రావడంతో ఈ దేవరపై మొదటి నుంచి అంచనాలు కాస్త భారీగానే ఏర్పడ్డాయి.

కాగా ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండియర్గా రిలీజ్ కానుండడంతో ఓవర్సీస్లో ప్రీ సేల్స్ మొదలయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ ప్రీ సేల్స్ రికార్డులు మీద రికార్డులు కొడుతున్నాయి. అలా తాజాగా ఈ దేవర ఖాతాలోకి మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీసేల్‌ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకున్న చిత్రంగా దేవర నిలిచింది. కాగా తాజాగా 2 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం విశేషం.

ఇకపోతే, దేవర విడుదలకు మరో 3 రోజులు ఉండడం వల్ల ఈ ప్రీ సేల్స్ బుకింగ్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కూడా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఈసినిమా ప్రమోషన్స్‌ కోసం ఎన్టీఆర్‌ తాజాగా అమెరికా వెళ్లినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. లాస్‌ ఏంజెలిస్‌లో జరగనున్న బియాండ్‌ ఫెస్ట్‌లో తారక్ పాల్గొబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ ఈవెంట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా దేవర నిలిచిన విషయం తెలిసిందే. చిత్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 26న అమెరికాలోని ప్రఖ్యాత ఈజిప్షియన్‌ థియేటర్‌లో ప్రీమియర్‌గా ఈ దేవరను ప్రదర్శించనున్నారు. అందుకే తారక్ ఇప్పటికే లాస్‌ ఏంజెలిస్‌ చేరుకున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>