EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth6f56c5c0-7481-4257-9538-deda7d1051de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth6f56c5c0-7481-4257-9538-deda7d1051de-415x250-IndiaHerald.jpgరాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కనీనం తెలంగాణలో అయినా అధికారంలోకి వస్తుందని భావిసత్ఏ అదీ జరగలేదు. సుమారు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. కాకలు తీరిన సీనియర్లు ఉన్నా.. రెండు దఫాలు జరిగిన ఎన్నికల్లో ఓటమి చవి చూసి.. బీఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టింది. ఎన్ని ప్రయోగాలు చేసినా.. కాంగ్రెస్ విజయవంతం కాలేకపోయింది. ఈ సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించారు. బీఆర్ఎస్ ను దrevanth{#}Mano;revanth;Revanth Reddy;Congress;Backward Classes;Kamareddy;local language;war;CM;Reddyపార్టీపై పట్టు కోల్పోతున్న రేవంత్? తిరిగి నిలబెట్టుకోవడం కష్టమేనా?పార్టీపై పట్టు కోల్పోతున్న రేవంత్? తిరిగి నిలబెట్టుకోవడం కష్టమేనా?revanth{#}Mano;revanth;Revanth Reddy;Congress;Backward Classes;Kamareddy;local language;war;CM;ReddyTue, 24 Sep 2024 10:55:00 GMTరాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కనీనం తెలంగాణలో అయినా అధికారంలోకి వస్తుందని భావిసత్ఏ అదీ జరగలేదు. సుమారు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. కాకలు తీరిన సీనియర్లు ఉన్నా.. రెండు దఫాలు జరిగిన ఎన్నికల్లో ఓటమి చవి చూసి.. బీఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టింది. ఎన్ని ప్రయోగాలు చేసినా.. కాంగ్రెస్ విజయవంతం కాలేకపోయింది.


ఈ సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించారు. బీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొన్నారు. క్యాడర్ లో మనో ధైర్యం నింపారు. ఎన్నికలకు సిద్ధం చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ క్రెడిట్ రేవంత్ రెడ్డితో పాటు.. సీనియర్లకు కూడా వస్తుంది. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లోను ప్రభావం చూపారు.


అధికారంలో ఉన్న కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవుతుంది. గత పదేళ్లలో గ్రామ స్థాయిలో కాంగ్రెస్ నేతలు పోటీ చేయాలంటే ఆలోచించేవారు. అన్నింటా బీఆర్ఎస్ ఆధిపత్యం దిగ్విజయంగా కొనసాగింది.  కొన్ని చోట్ల మాత్రమే కాంగ్రెస్, బీజేపీలు సత్తా చాటేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో లోకల్ బాడీలో సత్తా చాటాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.


లోకల్ బాడీలో సత్తా చాటి.. మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. స్థానిక రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతూ.. క్యాడర్ లో మమేకం కావాలని.. ఏ ఒక్క ఛాన్స్ ను వదులుకోవద్దని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రకటించింది. రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు. ఈ అంశం కలిసొస్తే వార్ వన్ సైడ్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్నింటికి మించి సీఎం రేవంత్ రెడ్డి గ్రామస్థాయిలో పార్టీపై పట్టు దొరుకుతుందని చెబుతున్నారు. 








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>