MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anasuya61174509-0f07-445c-ad8d-074aec56a906-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anasuya61174509-0f07-445c-ad8d-074aec56a906-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ న్యూస్ రీడర్ గా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బుల్లితెర షో జబర్దస్త్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ షోలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అనసూయ కొన్నేళ్ల పాటు యాంకర్ గా తన హవాను కొనసాగించింది. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా వివిధ షోలలో చురుగ్గా పాల్గొని తన సత్తాను చాటింది. అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన నటనతో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ వరanasuya{#}anasuya bharadwaj;Jabardasth;Anasuya;Manam;BEAUTY;Hero;Cinemaయాంకర్‌ అనసూయపై కన్నేసిన టాలీవుడ్‌ హీరో ?యాంకర్‌ అనసూయపై కన్నేసిన టాలీవుడ్‌ హీరో ?anasuya{#}anasuya bharadwaj;Jabardasth;Anasuya;Manam;BEAUTY;Hero;CinemaTue, 24 Sep 2024 13:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ న్యూస్ రీడర్ గా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బుల్లితెర షో జబర్దస్త్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ షోలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అనసూయ కొన్నేళ్ల పాటు యాంకర్ గా తన హవాను కొనసాగించింది. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా వివిధ షోలలో చురుగ్గా పాల్గొని తన సత్తాను చాటింది. అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన నటనతో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ వరుసగా సినిమాల్లో కీలకపాత్రల్లో నటించింది.


ప్రస్తుతం అనసూయ ఓ వైపు సినిమాలు, మరోవైపు షోలలో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అనసూయకి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ హీరో గురించి అనసూయ సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. హీరో అడివి శేషుతో కలిసి అనసూయ క్షణం అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే.


ఆ సినిమాలో అనసూయ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించింది. సినిమాలో ట్విస్ట్ ఏంటంటే..... ఆ సినిమాలో అనసూయ విలన్ కావడం. ఈ సినిమాలో అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా తర్వాత అనసూయకు మరిన్ని సినిమా అవకాశాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా గురించి అనసూయ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. నాకు ఫోర్ హెడ్ ఉంది. మొదట్లో నా ఫోర్ హెడ్ చూపించడానికి నాకు చాలా భయం వేసేది.


కానీ అడివి శేషు ఫోర్స్ చేయడంతో నా వెంట్రుకలను లైట్ గా దువ్వుకొని జడ వేసుకున్నాను. దాంతో నా ఫోర్ హెడ్ అందరికీ చూపించాల్సి వచ్చింది. అంతకు ముందు నన్ను అందరూ బట్టతల దాన అనేవారు. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత నా ఫోర్ హెడ్ ను ధైర్యంగా చూపించగలుగుతున్నానని అనసూయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>