MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-bookings4695a9be-9f27-467c-8a87-cf94d139eb01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-bookings4695a9be-9f27-467c-8a87-cf94d139eb01-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, యావత్ ఇండియా అంతటా దేవర ఫీవర్ నడుస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ విడుదల కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపైన భారీగా అంచనాలు నెలకొన్నరాయి. పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కిన ‘దేవర’ సినిమాపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఈ మూవీపై మరింత అంచనాలు పెంచేశాయి. కాగా, ‘దేవర’ మూవీ రిలీజ్‌కి ముందే రికార్డులను క్రియేటdevara bookings{#}srikanth;Cinema Tickets;Music;Hyderabad;cinema theater;ali;India;Audience;Jr NTR;Telugu;koratala siva;Cinemaదిమ్మతిరిగే రీతిలో 'దేవర' అడ్వాన్స్ బుకింగ్స్... ఇప్పటికే ఇదే రికార్డ్!దిమ్మతిరిగే రీతిలో 'దేవర' అడ్వాన్స్ బుకింగ్స్... ఇప్పటికే ఇదే రికార్డ్!devara bookings{#}srikanth;Cinema Tickets;Music;Hyderabad;cinema theater;ali;India;Audience;Jr NTR;Telugu;koratala siva;CinemaTue, 24 Sep 2024 10:59:00 GMT
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, యావత్ ఇండియా అంతటా దేవర ఫీవర్ నడుస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ ‘దేవర’ విడుదల కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపైన భారీగా అంచనాలు నెలకొన్నరాయి. పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కిన ‘దేవర’ సినిమాపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఈ మూవీపై మరింత అంచనాలు పెంచేశాయి. కాగా, ‘దేవర’ మూవీ రిలీజ్‌కి ముందే రికార్డులను క్రియేట్ చేస్తూ సత్తా చాటుతోంది. ఈ సినిమా ప్రీ-సేల్స్ అద్భుతంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


ముఖ్యంగా ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. హైదరాబాద్ AMB మాల్స్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో దేవర సినిమా ఓ అరుదైన ఫీట్ సొంతం చేసుకుంది. ఎప్పుడూ లేనంతగా రిలీజు రోజు ఇక్కడ 27 షోలు వేస్తున్నారు. టికెట్స్ అలా ఓపెన్ అయ్యాయో లేదో.. ఫస్ట్ డే 27 షోలు కూడా ఫుల్ అయిపోయినట్టు AMB మాల్ నిర్వాహకులు తాజాగా చెప్పుకొచ్చారు. ఇది చాలా అరుదైన రికార్డ్ అని చెప్పుకోవాలి. ఇంతకు మునుపు ఎప్పుడూ ఈ రీతిలో షోస్ ఫుల్ కాలేదని సమాచారం. ఓపెన్ అయిన 30 నిముషాల లోపే 27 షోలు బుక్ అయిపోయాయని తెలుస్తోంది. ఈ విషయం మనకి బుక్ మై షోస్ సైట్ చూసినా అర్ధం అయిపోతుంది.

అదే విధంగా ఇప్పటికీ దేవర సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబడుతోందని టాక్ వినబడుతోంది. ఇప్పటికే 1.75 మిలియన్ డాలర్స్ ప్రీ-సేల్స్ రూపంలో కలెక్ట్ చేసిందని చెప్పుకున్నాం. కాగా ‘దేవర’, ఒక్క సినీమార్క్ థియేటర్ చైన్‌లోనే 1 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టడం కొత్త విషయం అని చెప్పుకోవచ్చు. ఇలా రిలీజ్‌కి ముందే ‘దేవర’ రికార్డులకు హద్దు లేకుండా పోతుందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక సినిమా రిలీజ్ తరువాత ఈ రికార్డులు ఏ స్థాయికి చేరుతాయో చూడాలి మరి! జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘దేవర’ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించిన సంగతి తెలిసినదే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>