MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrd34ef513-abe9-47ee-ae61-30fd0d312ca2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrd34ef513-abe9-47ee-ae61-30fd0d312ca2-415x250-IndiaHerald.jpgఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత.. రెండున్నర సంవత్సరాల గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ చేసిన సినిమా కావడంతో దేవర 1 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ , అటు కొరటాల శివకు అత్యంత సన్నిహితుడు అయిన.. మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో దేవర సినిమాను నిర్మిస్తున్నారు. ntr{#}koratala siva;NTR;Heroine;Tollywood;Cinema' దేవర ' కు అక్కడ ఆశలు లేవా.. ఎన్టీఆర్‌కు కూడా నమ్మకం లేదా.. !' దేవర ' కు అక్కడ ఆశలు లేవా.. ఎన్టీఆర్‌కు కూడా నమ్మకం లేదా.. !ntr{#}koratala siva;NTR;Heroine;Tollywood;CinemaMon, 23 Sep 2024 12:06:04 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న దేవర 1.. ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత.. రెండున్నర సంవత్సరాల గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ చేసిన సినిమా కావడంతో దేవర 1 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ , అటు కొరటాల శివకు అత్యంత సన్నిహితుడు అయిన.. మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో దేవర సినిమాను నిర్మిస్తున్నారు.


ఈ సినిమాకు రూ.300 కోట్ల బడ్జెట్ అయినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్‌లో ప్రచారం జరుగుతోంది. దేవరపై అంచనాలు మామూలుగా లేవు .. తారాస్థాయిలో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.113 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని.. కర్ణాటకలో రూ.15 కోట్లు .. తమిళనాడులో రూ.6 కోట్ల మేర బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అయితే దేవర హిందీ బిజినెస్ ఎంత జరిగింది ? అన్నదాని పై క్లారిటీ రావడం లేదు.


దేవర హిందీ థియేటర్ రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని ( సీనియర్ హీరోయిన్ ర‌వీనా టాండ‌న్ ) భర్త రూ.15 కోట్లకు దక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా రూ.15 కోట్లు అంటే చాలా తక్కువ అని చెప్పాలి. పుష్ప లాంటి సినిమాలు ఏకంగా అక్కడ రూ.100 కోట్లు రాబట్టాయి. ఎన్టీఆర్‌తో పాటు.. కొరటాల నార్త్ లో ప్రత్యేకంగా ప్రమోషన్లు కూడా చేశారు. అయినా హిందీలో అనుకున్న స్థాయిలో బజ్‌రాలేదు. ఇంత చేసిన ఎన్టీఆర్‌కు ... అటు మేకర్స్‌కు దేవర రిజల్ట్ విషయంలో నార్త్‌లో అంత పూర్తి నమ్మకాలు లేవన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి దేవర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>