MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kareenab91f2c60-6ba5-46cc-b755-68636a16befe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kareenab91f2c60-6ba5-46cc-b755-68636a16befe-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సంవత్సరాలు పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కరీనా కపూర్ ఒకరు. ఈమె కెరియర్ మంచి ఊపులో ఉన్న దశలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత వీరి జీవితం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతుంది. తాజాగా కరీనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో పెళ్లి విషయం బయటకు వచ్చాక ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చారు అనే దానిపై ఈమె స్పందించింది. తాజా ఇంటర్వ్యూలో కరీనా కపూర్ మాట్లాడుతూ ... సైKareena{#}Kareena Kapoor;Beautiful;marriage;Saif Ali Khan;bollywood;Yevaru;Cinemaపెళ్లి అనగానే హెచ్చరికలు మొదలయ్యాయి.. కొందరైతే అలా అనేసారు.. కరీనా..!పెళ్లి అనగానే హెచ్చరికలు మొదలయ్యాయి.. కొందరైతే అలా అనేసారు.. కరీనా..!Kareena{#}Kareena Kapoor;Beautiful;marriage;Saif Ali Khan;bollywood;Yevaru;CinemaMon, 23 Sep 2024 13:50:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సంవత్సరాలు పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కరీనా కపూర్ ఒకరు. ఈమె కెరియర్ మంచి ఊపులో ఉన్న దశలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత వీరి జీవితం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతుంది. తాజాగా కరీనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో పెళ్లి విషయం బయటకు వచ్చాక ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చారు అనే దానిపై ఈమె స్పందించింది.

తాజా ఇంటర్వ్యూలో కరీనా కపూర్ మాట్లాడుతూ ... సైఫ్ అలీ ఖాన్ తో పెళ్లి అనే విషయం బయటకు రాగానే నా చుట్టూ ఉన్న ప్రపంచం అందులో ఉన్న జనాలు నాకు అనేక సలహాలను ఇవ్వడం మొదలు పెట్టారు. కొందరైతే పెళ్లి చేసుకుంటే కెరీర్ ముగిసినట్టే , ఇక నీకు సినిమా అవకాశాలు రావు , నువ్వు ఇండస్ట్రీలో అక్కడే ఆగిపోతావు అని భయపెట్టారు. కానీ నేను వారి మాటలను ఏ మాత్రం లెక్క చేయలేదు. కెరియర్ ముగిసిపోవాలి అని రాసి ఉంటే కచ్చితంగా ముగిసిపోతుంది. అది పెళ్లి చేసుకోవడం వల్ల ముగిసిపోతుంది అంటే నేను అస్సలు ఆ మాటలను పట్టించుకోలేదు.

నిజానికి అయితే నేను పెళ్లి తర్వాతే చాలా రిస్కు చేశాను. పెళ్లికి ముందు చేసిన సినిమాల కంటే రిస్క్ ఎక్కువగా ఉన్న సినిమాలు పెళ్లి తర్వాత చేశాను. దానితో ఎంతో మంది పెళ్లి తర్వాత కెరియర్ క్లోజ్ అవుతుంది అన్న దాన్ని నేను పక్కన పెట్టి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత కూడా నేను ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకొని ఇప్పటికీ కూడా కెరియర్ను మంచి జోష్లో ముందుకు సాగిస్తున్నాను అని కరీనా కపూర్ తాజాగా చెప్పుకొచ్చింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>