Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-harish-shankard3f202d8-c841-4860-8da9-970f7b4cc01f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-harish-shankard3f202d8-c841-4860-8da9-970f7b4cc01f-415x250-IndiaHerald.jpgకమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలకు ముందు చాలా కాన్ఫిడెంట్ గానే కనిపించాడు. కానీ ఆ సినిమా ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. ఈ సినిమా ఇంపాక్ట్ అయితే అతని కెరియర్ మీద పెద్దగా పడకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేయబోయే ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయడానికి హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అది మినిమమ్ హిట్టయినా లైన్ లోకి వచ్చినట్లే పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం హరీష్ వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటిగా ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యాక ఉ#harish shankar{#}harish shankar;Mister;editor mohan;shankar;kalyan;ravi anchor;Cinema;Director;Chiranjeeviలక్ అంటే హరీష్ దే డిజాస్టర్ ఇచ్చిన భారీ ఛాన్స్ పట్టాడుగా..?లక్ అంటే హరీష్ దే డిజాస్టర్ ఇచ్చిన భారీ ఛాన్స్ పట్టాడుగా..?#harish shankar{#}harish shankar;Mister;editor mohan;shankar;kalyan;ravi anchor;Cinema;Director;ChiranjeeviMon, 23 Sep 2024 22:19:00 GMTకమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలకు ముందు చాలా కాన్ఫిడెంట్ గానే కనిపించాడు. కానీ ఆ సినిమా ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. ఈ సినిమా ఇంపాక్ట్ అయితే అతని కెరియర్ మీద పెద్దగా పడకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేయబోయే ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయడానికి హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అది మినిమమ్ హిట్టయినా లైన్ లోకి వచ్చినట్లే పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం హరీష్ వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటిగా ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యాక ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంట. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేస్తారనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. మిస్టర్ బచ్చన్ మూవీ ప్రమోషన్స్ లో కూడా హరీష్ శంకర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

అయితే మెగాస్టార్ తో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది బాస్ చేతిలోనే ఉందని హరీష్ శంకర్ అన్నారు. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో డివివి దానయ్య ఒక సినిమా చేయబోతున్నారు. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి ఒక కమర్షియల్ యాడ్ లో కనిపించారు. ఆ కమర్షియల్ యాడ్ ని డైరెక్ట్ చేసింది హరీష్ శంకర్. అక్కడ కాస్త రాపో ఏర్పడడంతో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయమని ఆఫర్ ఇచ్చారట. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడినట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దానయ్య ఇప్పటికే హరీష్ శంకర్ తో పాటు చిరంజీవికి కూడా అడ్వాన్సులు పంపినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలకి ఆకాశం కనిపిస్తోంది అయితే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్లో ఉన్నాడు. హరిష్ శంకర్ సినిమా కంటే ముందు మరో సినిమా ఆయన పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో 2025 సంక్రాంతికి విశ్వంభర మూవీ థియేటర్స్ లోకి రానుంది. దీని తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారు. సుస్మిత కొణెదల ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని తెలుస్తోంది. బీవీఎస్ రవి ఈ సినిమాకి కథ అందిస్తున్నారంట. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా కూడా కంప్లీట్ అయ్యాక అప్పటి సిచువేషన్ బట్టి హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మూవీ చేసే అవకాశం ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. ఈ లోపు హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పూర్తి చేసే ఛాన్స్ ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>