EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan70fec134-646c-491d-a9b5-8cd7b8a4cb79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan70fec134-646c-491d-a9b5-8cd7b8a4cb79-415x250-IndiaHerald.jpg2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయిన ఏడు నెలలకు తిరుమలలో డిసెంబరు నెలలో బూంది పోటులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ వారి లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి బూందీ సిద్ధం చేస్తుండగా.. పొయ్యి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పోటు గోడలకు నెయ్యి మరకలు అంటుకున్నాయి. ఆ మరకలను మంటలు అంటుకున్నాయి. మంటల తాకిడికి బూందీ తయారీ కోసం వినియోగించే ముడి సరుకు మొత్తం కాలిపోయింది ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిjagan{#}YCP;Ghee;Maha;sree;Telugu Desam Party;Jagan;Newsఅప్పుడే హెచ్చరించిన తిరుమలేశుడు? తెలుసుకోలేకపోయిన జగన్!అప్పుడే హెచ్చరించిన తిరుమలేశుడు? తెలుసుకోలేకపోయిన జగన్!jagan{#}YCP;Ghee;Maha;sree;Telugu Desam Party;Jagan;NewsMon, 23 Sep 2024 09:48:00 GMT2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయిన ఏడు నెలలకు తిరుమలలో డిసెంబరు నెలలో బూంది పోటులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ వారి లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి బూందీ సిద్ధం చేస్తుండగా.. పొయ్యి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.


పోటు గోడలకు నెయ్యి మరకలు అంటుకున్నాయి. ఆ మరకలను మంటలు అంటుకున్నాయి. మంటల తాకిడికి బూందీ తయారీ కోసం వినియోగించే ముడి సరుకు మొత్తం కాలిపోయింది ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాద సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మూడు వాహనాల్లో వచ్చారు. అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు.  ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు స్పల్పంగా గాయపడ్డాడు.


ప్రస్తుతం లడ్డూ ప్రసాదం గురించి వివాదం జరుగుతున్న నేపథ్యంలో నాటి ఘటనను తెలుగుదేశం నేతలు ప్రస్తావిస్తున్నారు. నాడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చోటు చేసుకున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. సహజంగా యజ్ఙాలు, యాగాలు చేసే సమయంలో దేవతలకు అగ్ని దేవుడు హోమ ద్రవ్యాలను దేవతలకు చేర్చే పని భుజానికి ఎత్తుకుంటాడు. కానీ తిరుమలలో వేంకటేశ్వర స్వామికి వకుళ మత ప్రసాదం తయారు చేస్తోంది. అయినా స్వామి వారి బూందీ పోటులో జరుగుతున్న దారుణం చూడలేక ఆగ్రహం వ్యక్తం చేశారు.


అగ్ని కిలలతో బుసలు కొట్టారు. వాయువుతో గోడకున్న నెయ్యిమరకలను అంటించి చూపారు. నాటి రోజుల్లో ఎవరైనా గొప్ప వ్యక్తి ఉంటే స్వామి వారి సంకేతాలను అవగతం చేసుకునేవారు. కానీ అలా జరగలేదు. గాయత్రి మంత్రోపాసకులు, పీఠాధిపతులు, గొప్ప గొప్ప వాళ్లు స్వామి వారి పేరు పఠిస్తూ గోవిందా గోవిందా అంటూ ఆ లడ్డూలను మహా ప్రసాదంగా తిన్నారు. కానీ ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రసాదమా మేం తిన్నది అని బాధపడుతున్నారని కూటమి నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>