MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr-sr-ntr-nandamuri-family-devara-movie-jr-ntr-remunaration870ece89-d1ae-415f-88a4-56dba68c2698-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr-sr-ntr-nandamuri-family-devara-movie-jr-ntr-remunaration870ece89-d1ae-415f-88a4-56dba68c2698-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన హీరోల పేర్లు చెప్పగానే చాలామంది గుర్తుకు వచ్చేది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు.. ఈయన నటన పరంగా డ్యాన్స్ పరంగా అదరగొట్టేస్తారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ అదేది పట్టించుకోకుండా తన సొంత టాలెంట్ నే నమ్ముకుని ముందుకు వెళ్తారు. అలాంటి ఎన్టీఆర్ ప్రస్తుతం నందమూరి కుటుంబానికి తలమానికంగా మారారని చెప్పవచ్చు. నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా హీరోగా ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన అంచలంచెచలుగా ఎదిగి పాన్ ఇండియా స్థాయి హీరో అయ్యారు. అయితే ఎన్టీఆJR.NTR; SR.NTR; NANDAMURI FAMILY; DEVARA MOVIE; JR.NTR REMUNARATION{#}Komaram Bheem;Aravinda Sametha Veera Raghava;Simhadri;Prasthanam;RRR Movie;Ramayya Vastavayya;producer;Producer;Chitram;Mass;Rajamouli;India;NTR;koratala siva;Jr NTR;Telugu;Cinema;Heroడైరెక్టర్స్ భయపడే స్థాయి నుంచి ఇంటి ముందు క్యూ కట్టే స్థాయి వరకు..Jr.ఎన్టీఆర్ ప్రస్థానం మామూలుగా లేదుగా..!!డైరెక్టర్స్ భయపడే స్థాయి నుంచి ఇంటి ముందు క్యూ కట్టే స్థాయి వరకు..Jr.ఎన్టీఆర్ ప్రస్థానం మామూలుగా లేదుగా..!!JR.NTR; SR.NTR; NANDAMURI FAMILY; DEVARA MOVIE; JR.NTR REMUNARATION{#}Komaram Bheem;Aravinda Sametha Veera Raghava;Simhadri;Prasthanam;RRR Movie;Ramayya Vastavayya;producer;Producer;Chitram;Mass;Rajamouli;India;NTR;koratala siva;Jr NTR;Telugu;Cinema;HeroMon, 23 Sep 2024 09:33:00 GMT- నిన్ను చూడాలని చిత్రంతో ప్రస్థానం మొదలు..
-  6 లక్షల రెమ్యూనరేషన్ తో మొదలై 60 కోట్ల వరకు..
- జూనియర్ మహాప్రస్థానం వెనుక మామూలు కష్టం లేదు..


 జూనియర్ ఎన్టీఆర్ ని చాలామంది ఈయన ఓ పెద్దింటి కుటుంబానికి చెందిన హీరో అని అంటారు. నిజానికి పెద్దింటి కుటుంబానికి చెందిన హీరోనే కానీ ఆ కుటుంబం ఎన్టీఆర్  ను ఆదరించడానికి చాలా టైం పట్టింది. తన కష్టం మీద తాను ఎదిగిన తర్వాత ఆదరించారు.. కుటుంబం ఆదరించకపోయినా తన sr. ఎన్టీఆర్ మాత్రం  ఎన్టీఆర్ ను చేరదీసి తన టాలెంట్ ను బయటకు తీశారు. తాత ఇచ్చిన బూస్టింగ్ తో మనవడు జూనియర్ ఎన్టీఆర్ చిన్న స్థాయి హీరో నుంచి పాన్ ఇండియా స్థాయి హీరో అయ్యారు.తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇలాంటి జూనియర్ ఎన్టీఆర్  ఇంతటి స్థాయికి రావడానికి మామూలు కష్టపడలేదు. ప్రతిక్షణం  ఎదుగుదల కోసం ఎంతో శ్రమించి చివరికి పాన్ ఇండియా స్థాయిలో హీరోగా నిలదొక్కుకున్నారు.అలాంటి జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని మూవీ నుంచి మొదలు దేవర సినిమా వరకు ఎలా ఎదిగారు.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే వివరాలు చూద్దాం.

 ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ :
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన హీరోల పేర్లు చెప్పగానే చాలామంది గుర్తుకు వచ్చేది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు.. ఈయన నటన పరంగా డ్యాన్స్ పరంగా అదరగొట్టేస్తారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ అదేది పట్టించుకోకుండా తన సొంత టాలెంట్ నే నమ్ముకుని ముందుకు వెళ్తారు. అలాంటి ఎన్టీఆర్ ప్రస్తుతం నందమూరి కుటుంబానికి తలమానికంగా మారారని చెప్పవచ్చు. నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా హీరోగా ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన అంచలంచెచలుగా ఎదిగి పాన్ ఇండియా స్థాయి హీరో అయ్యారు. అయితే ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి మామూలు కష్టం లేదని చెప్పవచ్చు. పెద్ద కుటుంబంలో పుట్టినా ఆదరణ లేని అవమానకర పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఒక్క సినిమా తీయడానికి కూడా ప్రొడ్యూసర్ దొరకని స్థాయి నుంచి  ఇంటర్నేషనల్ రేంజ్ సినిమాలు చేయడానికి డైరెక్టర్లు క్యూ కట్టే రేంజ్ కు ఎదిగాడు. ఆయన పేరులోను నటలలోను  తాతను తలపించే విధంగా ఉంటారు.అలాంటి ఈయన ప్రస్తుతం ఒక గ్లోబల్ స్టార్. తన ప్రతిభతో తానే ఇండస్ట్రీలో ఎదగలిగారు. తాత ఆశీర్వాదం తల్లిదండ్రుల అండదండలతో ఇండస్ట్రీలో రాణించారు.

 అలాంటి ఎన్టీఆర్ నిన్ను చూడాలని మూవీ నుంచి దేవర సినిమా వరకు  ఎంతో ఎదిగిపోయారు. ఆరు లక్షల పారితోషికం నుంచి 60 కోట్ల పారితోషకం తీసుకునే రేంజ్ కు వచ్చారని చెప్పవచ్చు. నిన్ను చూడాలని సినిమా  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన మొదటి సినిమా. కానీ ఈ చిత్రం అంతగా హీట్ అవ్వలేదు. ఈ సినిమాకు ఆరు లక్షల పారితోషికం తీసుకొని ఆయన హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రాన్ని  చేశారు. ఈ సినిమాకు ఒక కోటి 80 లక్షల బడ్జెట్ పెడితే 12 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే ఈ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 30 నుంచి 35 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వచ్చిన సింహాద్రి సినిమా ద్వారా మరో భారీ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆంధ్ర వాలా,నా అల్లుడు,  అశోక్, రాఖీ చిత్రాల ద్వారా ఓ మోస్తారు పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాల సమయంలో ఆయన రెమ్యూనరేషన్ కోటి ఆ పైన పెరిగిందని తెలుస్తోంది. ఇక 2007లో వచ్చిన యమదొంగ సినిమా ఆయన కెరియర్ను మరో విధంగా మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ మరింత రెట్టింపు అయిపోయింది. ఈ సినిమాకు ఆయన 8 నుంచి 10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారట.

 ఆ తర్వాత కంత్రి, బృందావనం,అదుర్స్,శక్తి, ఊసరవెల్లి, దమ్ము,బాద్ షా, రామయ్య వస్తావయ్య సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ చిత్రాల సమయంలో ఆయన రెమ్యూనరేషన్ 10 కోట్ల నుంచి 15 కోట్ల మధ్య పెరిగినట్టు తెలుస్తోంది. ఈ విధంగా మాస్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్  నాన్నకు ప్రేమతో,టెంపర్, జై లవకుశ, అరవింద సమేత తో వరుసగా ఐదు సినిమాలు సూపర్ హిట్స్ అందుకున్నాడు.  దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోనే టాప్ ఫైవ్ హీరోల్లో ఒకరిగా మారారు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ చేశారు.ఇందులో కొమరం భీం పాత్రలో నటించారు.  ఈ సినిమాకు గాను ఆయన 40 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ భారీ హిట్ అవడంతో  జూనియర్ ఎన్టీఆర్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోయింది.  ఇక ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్లో దేవర అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27,2024 లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 60 కోట్లకు పైగానే పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. ఇలా ఆరు కోట్ల నుంచి 60 కోట్ల వరకు జూనియర్ ఎన్టీఆర్ రావడం వెనుక  ఎంతో కష్టం ఉందని నందమూరి అభిమానులు అంటుంటారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>