MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sandeep114aaecc-abcd-43ed-9b95-e53dfedbac29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sandeep114aaecc-abcd-43ed-9b95-e53dfedbac29-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు మజాకా అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా అనౌన్స్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బరిలో నిలవబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. కాకపోతే కొంత మంది మాత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందరSandeep{#}sundeep kishan;Yuva;Venkatesh;Naga Chaitanya;Chiranjeevi;Tollywood;Balakrishna;advertisement;Makar Sakranti;Cinemaఅసలు తగ్గని సందీప్ కిషన్.. అఫీషియల్ ప్రకటనతో వారందరికీ షాక్..?అసలు తగ్గని సందీప్ కిషన్.. అఫీషియల్ ప్రకటనతో వారందరికీ షాక్..?Sandeep{#}sundeep kishan;Yuva;Venkatesh;Naga Chaitanya;Chiranjeevi;Tollywood;Balakrishna;advertisement;Makar Sakranti;CinemaMon, 23 Sep 2024 12:05:00 GMTటాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు మజాకా అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా అనౌన్స్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బరిలో నిలవబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. 

కాకపోతే కొంత మంది మాత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన విశ్వంభర , విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమా , అలాగే బాలయ్య హీరోగా రూపొందుతున్న సినిమా కూడా బరిలో నిలిచే అవకాశం ఉన్నందున అంత మంది స్టార్ హీరోల మధ్యలో సందీప్ కిషన్ సినిమా వచ్చే అవకాశం లేదు అనే ఆలోచనను చాలా మంది వ్యక్తం చేశారు. కానీ సందీప్ కిషన్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఆయన హీరోగా రూపొందుతున్న మజాకా మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను  కూడా విడుదల చేశారు. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు చిరంజీవి , వెంకటేష్ హీరోలుగా రూపొందుతున్న మూవీ లు విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటనలు కూడా వచ్చేసాయి. ఇక బాలయ్య సినిమా అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న తండెల్ మూవీ విడుదల కూడా సంక్రాంతి కి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇంత మంది టాలీవుడ్ స్టార్ హీరోల మధ్యలో సందీప్ కిషన్ వస్తాడా ..? లేక ఆ సమయంలో వెనక్కు తగ్గుతాడా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>