MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr7941b488-61d9-40d4-96fb-60230228b95e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr7941b488-61d9-40d4-96fb-60230228b95e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో దేవర సినిమా ఫీవర్ నడుస్తోంది. రాబోతున్న ఫ్రైడే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా పైన నందమూరి అభిమానులతో పాటుగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మాణ సారధ్యంలో, కొరటాల శివ దర్శకత్వంలో, జూనియర్ ఎన్టీఆర్- జాహ్నవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న దేవర చిత్రం విడుదలకి ఇంకా నాలుగు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉన్నది. చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. ఇక రిలీజ్ ట్రైలర్ గా రిలీజ్ అయిన తాజా ట్రైలర్ యూటntr{#}prasanth;Prashant Kishor;kushi;Kushi;Kannada;Chitram;Jr NTR;you tube;koratala siva;NTR;Telugu;sandeep;Darsakudu;Tamil;Director;India;Tollywood;News;Hero;media;Cinemaఎన్టీఆర్ రాబోయే సినిమాల లిస్టు చూస్తే మతిపోతుంది!ఎన్టీఆర్ రాబోయే సినిమాల లిస్టు చూస్తే మతిపోతుంది!ntr{#}prasanth;Prashant Kishor;kushi;Kushi;Kannada;Chitram;Jr NTR;you tube;koratala siva;NTR;Telugu;sandeep;Darsakudu;Tamil;Director;India;Tollywood;News;Hero;media;CinemaSun, 22 Sep 2024 16:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో దేవర సినిమా ఫీవర్ నడుస్తోంది. రాబోతున్న ఫ్రైడే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా పైన నందమూరి అభిమానులతో పాటుగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మాణ సారధ్యంలో, కొరటాల శివ దర్శకత్వంలో, జూనియర్ ఎన్టీఆర్- జాహ్నవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న దేవర చిత్రం విడుదలకి ఇంకా నాలుగు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉన్నది. చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. ఇక రిలీజ్ ట్రైలర్ గా రిలీజ్ అయిన తాజా ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఇప్పటికే బుక్ మై షో వెబ్ సైట్ లో బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. దిమ్మతిరిగే ఓపెనింగ్స్ వస్తున్నాయని మేకర్స్ ఖుషి గా ఉన్నారు.

అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమా తర్వాత తారక్ చేయబోతున్న సినిమాల లిస్టును తాజాగా ఓ మీడియా వేదిక ద్వారా చెప్పుకొచ్చాడు. ఈ సమాచారం అందుకున్న అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. దేవర సినిమా తర్వాత సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ రెస్ట్ తీసుకుంటాడని అంతా భావించారు. కానీ ఊపిరి సలపనంత పనితో జూనియర్ బిజీ కాబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఒక పాన్ ఇండియా దర్శకుడు తో జూనియర్ పనిచేయనున్నాడు.

ఆ దర్శకుడు మరెవరో కాదు, కే జి ఎఫ్ సినిమాతో కన్నడ సినిమాని తారాస్థాయిలో ఉంచిన తెలుగు దర్శకుడు ప్రశాంత్ నీల్. అవును, మరికొద్ది రోజుల్లోనే వీరి కాంబోలో సినిమా తెరకెక్కనుంది. అయితే మిగతా విషయాలు చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా రిలీజ్ చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఆశ పడుతున్న అదిరిపోయే కాంబో సెట్ కానుంది. ఆదర్శకుడు మీరెవరో కాదు సందీప్ రెడ్డి వంగ. ఈయన గురించి ఎక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగోడి సత్తాను చాటిన దర్శకులలో ఈయన కూడా ఒకడు. ఈ రెండు సినిమాలు తర్వాత ఎన్టీఆర్ ఊహించని విధంగా ఇద్దరు తమిళ దర్శకలతో పని చేయనున్నాడని టాక్ వినబడుతుంది. అందులో ఒకడు దర్శకుడు వెట్రి మారన్, మరొకరు అట్లీ. వీరి గురించి కూడా పరిచయం అవసరం లేదు... వీరి దర్శకత్వంలో నటించాలని ఉంది అంటూ.. జూనియర్ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... వీరిద్దరి కాంబో ఎన్టీఆర్ తో సెట్ అయిందని గుసగుసలు వినబడుతున్నాయి. దాంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>