MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sukumar-tho-jani-master-bharya-bheti-eee6996b-b798-4ffc-b256-a2a36dc0be54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sukumar-tho-jani-master-bharya-bheti-eee6996b-b798-4ffc-b256-a2a36dc0be54-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో ప్రతి విషయంలో టార్గెట్ అవుతున్నారు.ఆ మధ్యకాలంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో వైసిపి స్నేహితుడికి సపోర్ట్ చేసి విమర్శల పాలయ్యాడు. అప్పటినుండి అల్లు మెగా వార్ నడుస్తోంది. ఇది చాలదానట్లు నాగబాబు పెట్టిన ట్వీట్, పవన్ కళ్యాణ్ పుష్ప సినిమా గురించి టార్గెట్ చేసి పరోక్షంగా మాట్లాడిన మాటలు,అల్లు అర్జున్ ఓ సినిమా ఈవెంట్లో చేసిన కామెంట్లు ఇలా ప్రతి ఒక్కటి వీరి మధ్య గొడవకి ఆజ్యం పోసాయి.ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అల్లు మెగా అభిమానులు దగ్గరుంటే కొట్టుకుంటాం అనేంతలా ఒకరిపైSUKUMAR; AYESHA; ALLU ARJUN; JANI MASTER; PUSHPA 2{#}Nagababu;Arjun;johnny;Johnny;geetha;Allu Arjun;police;Hero;kalyan;netizens;Director;Cinema;Girl;Elections;media;war;Wife;YCP;News;Andhra Pradeshసుకుమార్ తో జానీ మాస్టర్ భార్య భేటీ.. అల్లు అర్జున్ కి ఇత్తడే..?సుకుమార్ తో జానీ మాస్టర్ భార్య భేటీ.. అల్లు అర్జున్ కి ఇత్తడే..?SUKUMAR; AYESHA; ALLU ARJUN; JANI MASTER; PUSHPA 2{#}Nagababu;Arjun;johnny;Johnny;geetha;Allu Arjun;police;Hero;kalyan;netizens;Director;Cinema;Girl;Elections;media;war;Wife;YCP;News;Andhra PradeshSun, 22 Sep 2024 13:46:39 GMTఅల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో ప్రతి విషయంలో టార్గెట్ అవుతున్నారు.ఆ మధ్యకాలంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో వైసిపి స్నేహితుడికి సపోర్ట్ చేసి విమర్శల పాలయ్యాడు. అప్పటినుండి అల్లు మెగా వార్ నడుస్తోంది. ఇది చాలదానట్లు నాగబాబు పెట్టిన ట్వీట్,  పవన్ కళ్యాణ్ పుష్ప సినిమా గురించి టార్గెట్ చేసి పరోక్షంగా మాట్లాడిన మాటలు,అల్లు అర్జున్సినిమా ఈవెంట్లో చేసిన కామెంట్లు ఇలా ప్రతి ఒక్కటి వీరి మధ్య గొడవకి ఆజ్యం పోసాయి.ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అల్లు మెగా అభిమానులు దగ్గరుంటే కొట్టుకుంటాం అనేంతలా ఒకరిపై ఒకరు విరుచుకు పడుతున్నారు.ఇది చాలదన్నట్లు తాజాగా జానీ మాస్టర్ వివాదంలో కూడా అల్లు అర్జున్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. జానీ మాస్టర్ లైంగికంగా వేధించిన మహిళకు అల్లు అర్జున్ సపోర్ట్ ఇచ్చారని,ఆయన గీత ఆర్ట్స్లో పనిచేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఆయన ఆఫీషియల్ గా స్పందించక పోయినప్పటికీ యాంకర్,నటి అయినటువంటి ఝాన్సీ బాధిత మహిళకి ఓ పెద్ద హీరో సపోర్టుగా నిలిచారు. ఆయన తన మేనేజర్ ని పంపించి మాట్లాడారు అంటూ చెప్పింది. దీంతో ఆ పెద్ద హీరో అల్లుఅర్జునే అని అందరూ భావిస్తున్నారు. 

అంతేకాదు జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండడంతో అల్లు అర్జున్ కి దూరమయ్యారు అనే టాక్ కూడా వినిపిస్తుంది.ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఈ వివాదంలో టార్గెట్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జానీ మాస్టర్ భార్య ఆయేషా కూడా పలు ఇంటర్వ్యూలలో ఆ అమ్మాయి వెనుక అల్లు అర్జున్ ఉన్నట్లు మాట్లాడింది. పుష్ప పెద్దల సహాయంతోనే ఆ అమ్మాయి అలా చేస్తుందని కూడా చెప్పింది. దీంతో అల్లు అర్జున్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. అయితే ఇంత పెద్ద ఇష్యూలో అల్లు అర్జున్ తన పేరు వినిపించినా కూడా అందులో నా ప్రేమమేం లేదు అని చెప్పడం లేదంటే కచ్చితంగా అల్లు అర్జున్ సపోర్ట్ ఆ అమ్మాయికి ఉందని అర్థమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా జానీ మాస్టర్ భార్య ఆయేషా ఒక సంచలనం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అదేంటంటే..పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో ఆయేషా బేటి అవ్వాలని చూస్తుందట. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఉన్న డాన్సర్స్ అసోసియేషన్ ని కలిసి ఆయేషా మాట్లాడాలని చూస్తుందట. సినిమా పెద్దలందర్నీ కలిసి తన భర్తకు మద్దతు ఇవ్వాలని,జరుగుతున్న కుట్రని పక్కన పెట్టి నిర్దోషిగా తన భర్తను బయటకు తీసుకురావాలని సినిమా పెద్దలతో జానీ మాస్టర్ భార్య భేటీ అవ్వాలని చూస్తుందట. అయితే జానీ మాస్టర్ మాత్రం పోలీసుల విచారణలో ఆ అమ్మాయి పై అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నారని నార్సింగి పోలీసులు బయటపెట్టారు. అయితే తాజాగా జానీ మాస్టర్ భార్య సుకుమార్ తో భేటి అంటూ వస్తున్న వార్తలతో చాలామంది నెటిజన్స్ బన్నీని టార్గెట్ చేస్తూ ఇక బన్నీకి ఇత్తడే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ ఇష్యూ ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>