Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puhspa10ab1aea-2506-4bef-ac27-e1cc12a00ba0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puhspa10ab1aea-2506-4bef-ac27-e1cc12a00ba0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకానిక్ స్టార్ గా మారిపోయారు. అంతేకాదు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే అల్లు అర్జున్ కు ఈ రేంజ్ లో పాపులారిటీ తెచ్చి పెట్టిన సినిమా ఏది అంటే అందరికీ పుష్ప మూవీనే గుర్తుకు వస్తుంది. తెలుగు ప్రేక్షకులకు అయితే అల్లు అర్జున్ పేరు వినిపిస్తే ఇంకా చాలా సినిమాలు గుర్తుకు వస్తాయేమో.. కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం పుష్ప సినిమాతోనే అల్లు అర్జున్ బాగా సుపరిచితుడుగా మారిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకేక్కిన పుష్ప puhspa{#}sukumar;Allu Arjun;December;Blockbuster hit;producer;Producer;bollywood;Telugu;India;News;Cinemaపుష్ప-2.. అలాంటి ట్విస్టులేమి లేవు.. నిజం చెప్పేసిన నిర్మాత?పుష్ప-2.. అలాంటి ట్విస్టులేమి లేవు.. నిజం చెప్పేసిన నిర్మాత?puhspa{#}sukumar;Allu Arjun;December;Blockbuster hit;producer;Producer;bollywood;Telugu;India;News;CinemaSun, 22 Sep 2024 11:00:00 GMTటాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకానిక్ స్టార్ గా మారిపోయారు. అంతేకాదు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే అల్లు అర్జున్ కు ఈ రేంజ్ లో పాపులారిటీ తెచ్చి పెట్టిన సినిమా ఏది అంటే అందరికీ పుష్ప మూవీనే గుర్తుకు వస్తుంది. తెలుగు ప్రేక్షకులకు అయితే అల్లు అర్జున్ పేరు వినిపిస్తే ఇంకా చాలా సినిమాలు గుర్తుకు వస్తాయేమో.. కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం పుష్ప సినిమాతోనే అల్లు అర్జున్ బాగా సుపరిచితుడుగా మారిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకేక్కిన పుష్ప మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఈ మూవీలోని పాటలు డైలాగ్స్ యాక్షన్ ఇలా అన్నీ కూడా సినీ ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేశాయి. అయితే ఇక ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతుంది. పుష్ప 2 మూవీ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్ట్ వన్ తో పోల్చి చూస్తే మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతూనే ఉన్నారు. ఇక ఎట్టకేలకు డిసెంబర్ 6వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ మరో తేదీని ప్రకటించారు. దీంతో  ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


 ఇలాంటి సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాడు నిర్మాత బన్నీ వాసు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా విడుదల విషయంలో ఎలాంటి ట్విస్టులు లేవు అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తనకున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 6వ తేదీని రిలీజ్ కాబోతున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. దానికి అనుగుణంగా సినిమా షూటింగ్ జరుగుతుంది అంటూ తెలిపాడు. దీంతో బన్నీ ఫాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈసారైనా వాయిదా పడకుండా రిలీజ్ అయితే అంతకంటే ఇంకేం అవసరం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి అన్న విషయం తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>