Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh0eadfdcc-e9fa-4709-bdb6-197e9fb889c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh0eadfdcc-e9fa-4709-bdb6-197e9fb889c1-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ లాండ్ మార్క్ మూవీ 75వ సినిమా దగ్గుబాటి ఫ్యాన్స్ ని నిరాశపరచింది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన సైంధవ్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో వెంటనే మరో హిట్ కొట్టే దాకా వెంకీ మామ మనసు కుదుట పడేలా లేదు. తన హిట్టు ఫ్లాపుల గురించి వెంకటేష్ అసలు పట్టించుకోడు కానీ ఈసారి ఎందుకో కచ్చితంగా సక్సెస్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడని తెలుస్తుంది. Venkatesh{#}aishwarya rajesh;anil ravipudi;Pongal;Venky Mama;Yevaru;F3;Director;Cinema;Success;Venkateshవెంకీ ఈసారి పిండేసేందుకు సిద్ధమా..?వెంకీ ఈసారి పిండేసేందుకు సిద్ధమా..?Venkatesh{#}aishwarya rajesh;anil ravipudi;Pongal;Venky Mama;Yevaru;F3;Director;Cinema;Success;VenkateshSun, 22 Sep 2024 23:06:25 GMTవిక్టరీ వెంకటేష్ లాండ్ మార్క్ మూవీ 75వ సినిమా దగ్గుబాటి ఫ్యాన్స్ ని నిరాశపరచింది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన సైంధవ్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో వెంటనే మరో హిట్ కొట్టే దాకా వెంకీ మామ మనసు కుదుట పడేలా లేదు. తన హిట్టు ఫ్లాపుల గురించి వెంకటేష్ అసలు పట్టించుకోడు కానీ ఈసారి ఎందుకో కచ్చితంగా సక్సెస్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం వెంకటేష్ సూపర్ హిట్ డైరెక్టర్ అనీల్ రావిపుడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ వెంకటేష్ తో ఎఫ్2,ఎఫ్3 సినిమాలు చేసిన ఈ కాంబోలో మరో సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. ఎఫ్2, ఎఫ్3 సినిమాల్లో వెంకటేష్ కామెడీని వాడుకున్న అనీల్ రావిపుడి ఈసారి వెంకీ లోని ఎమోషన్ ని వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే వెంకీ 76 సినిమాలో ఎమోషన్ పాళ్లు కాస్త ఎక్కువే అని తెలుస్తుంది.

అందుకే సినిమాను సంక్రాంతుఇకి రిలీజ్ చేస్తున్నారు. పొంగల్ రేసులో ఎవరు ఎలాంటి సినిమాలతో వచ్చినా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంక కొద్దిపాటి ఎమోషన్స్ ఉంటే సినిమా సూపర్ హిట్ అన్నట్టే లెక్క. ఇక అలాంటి ఎమోషన్స్ పండించడంలో వెంకటేష్ కి వెన్నతో పెట్టిన విద్య.. అందుకే అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో ఎమోషన్ పిండేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తుంది. అదే టైటిల్ ఐతే సంక్రాంతికి రిలీజ్ కన్ ఫర్మ్ అయినట్టే లెక్క. ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. వెంకటేష్ సినిమాలో ఏయే అంశాలు ఉండాలో పర్ఫెక్ట్ గా కాలిక్యులేట్ చేసి అనీల్ రావిపుడిసినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. మరి వెంకీ మామ ఈ సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>