Sportsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/msdhonia008051f-7495-4f3e-8a6b-f32b5690ca71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/msdhonia008051f-7495-4f3e-8a6b-f32b5690ca71-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ సుదీర్ఘంగా సాగింది. అంతర్జాతీయ ఆటగాడిగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎప్పుడూ లైమ్‌లైట్‌లోనే ఉన్న ధోనీ ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించాడు. భారత క్రికెట్‌లో పెద్ద పేరు సంపాదించినప్పటికీ, MS ధోని రాంచీ నగరాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడు. అక్కడే నివసిస్తున్నాడు. ఎంఎస్ ధోనీ తన కూతురిలోనూ అదే అనుభూతిని నింపాలనుకుంటున్నాడు. ధోనీ భార్య సాక్షి 2015లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఎంఎస్ ధోని ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. భారత జట్టుకు కెప్msdhoni{#}Amit Shah;jeeva;london;Chennai;Capital;School;INTERNATIONAL;MS Dhoni;Wife;Ishtam;Yuvaధోని కుమార్తె చదివే స్కూల్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ధోనినా మజాకా..?ధోని కుమార్తె చదివే స్కూల్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ధోనినా మజాకా..?msdhoni{#}Amit Shah;jeeva;london;Chennai;Capital;School;INTERNATIONAL;MS Dhoni;Wife;Ishtam;YuvaSun, 22 Sep 2024 12:00:00 GMTటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ సుదీర్ఘంగా సాగింది. అంతర్జాతీయ ఆటగాడిగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎప్పుడూ లైమ్‌లైట్‌లోనే ఉన్న ధోనీ ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించాడు. భారత క్రికెట్‌లో పెద్ద పేరు సంపాదించినప్పటికీ, MS ధోని రాంచీ నగరాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడు. అక్కడే నివసిస్తున్నాడు. ఎంఎస్ ధోనీ తన కూతురిలోనూ అదే అనుభూతిని నింపాలనుకుంటున్నాడు. ధోనీ భార్య సాక్షి 2015లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఎంఎస్ ధోని ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా.. వన్డే ప్రపంచకప్ ట్రోఫీని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కూతురు జీవా పుట్టినప్పుడు ధోనీ ఇండియాలో లేడు.దేశం తరఫున ఆడుతూ తన కుటుంబంతో లేకుండా విలువైన క్షణాలను త్యాగం చేశాడు ధోనీ. రాబోయే యువ క్రికెటర్లకు రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ఇక ధోనీ కుమార్తె జీవాగురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నోసార్లు ధోనీ ఆట చూసేందుకు గ్రౌండ్ కు వచ్చింది. కూతురితో ఆడుకోవడం అంటే ధోనీకి చాలా ఇష్టం.ఇక ధోనీ కూతురు జీవా జార్ఖండ్ రాజధాని రాంచీలో పెరుగుతోంది. ప్రస్తుతం 8 ఏళ్ల జీవా 3వ తరగతి చదువుతోంది. స్కూల్లో చాలా తెలివైన బాలికగా పేరు తెచ్చుకుంది. జీవా ధోని స్కూల్ పేరు టౌరియన్ వరల్డ్ స్కూల్, రాంచీటౌరియన్ వరల్డ్ స్కూల్.

రాంచీలోని ఉత్తమ పాఠశాలల్లో ఒకటి. అందువలన, వార్షిక పాఠశాల ఫీజులు కూడా ఎక్కువగా ఉంటాయి. పెద్ద సెలబ్రిటీ కుమార్తె కావడంతో మంచి సంస్థలోనే చదువుతుంది జీవా. కుమార్తె క్రీడలు లేదా కళలలో వెనుకబడి ఉండటం ధోనీకి ఇష్టం లేదు.ఈ స్కూలును అమిత్ బజ్లా 2008లో స్థాపించారు.రాంచీలో మొత్తం 65 ఎకరాల్లో టౌరియన్ వరల్డ్ స్కూల్‌ను  నిర్మించారు. ఈ స్కూల్ ఫౌండర్ అయిన అమిత్ బజ్లా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదువుకున్నారు. ఈ స్కూల్‌లో సాంప్రదాయ విద్యతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్, హార్స్ రైడింగ్, శారీరక, మానసిక శ్రేయస్సు, ఆటలతోపాటు మరెన్నో నేర్పిస్తారు. ఈ స్కూల్‌లో అంతర్జాతీయ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అకడమిక్ ఎక్స్‌లెన్స్ మాత్రమే కాకుండా సృజనాత్మక, విమర్శనాత్మక ఆలోచనను, భావోద్వేగ మేధస్సును పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించారు. విద్యార్థి కేంద్రకంగా ఇక్కడ విద్యా వ్యవస్థ ఉంటుంది.ఈ స్కూల్‌లో చదవాలంటే మాత్రం ఫీజు కాస్త గట్టిగా సమర్పించుకోవాల్సిందే. ఈ స్కూలులో ఎల్‌కేజీ నుంచి 8వ తరగతి వరకు రూ. 4.40 లక్షలు వసూలు చేస్తారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రూ. 4.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కూల్‌లో విద్యార్థులకు క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ మొదలైన అంశాలపై లైఫ్ స్కిల్స్‌ను కూడా బోధిస్తారట.ఈ నేపథ్యంలో కోట్లాది ఆస్తులున్న ధోనీకి ఈ మొత్తం పెద్దదేమీ కాదు. ఇప్పుడు జీవా ధోని సోషల్ మీడియాలో పాపులర్ పర్సన్. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 2.3 మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>