PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/koneti-adimulame7bddb63-d67d-43a5-ab1b-932a00207579-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/koneti-adimulame7bddb63-d67d-43a5-ab1b-932a00207579-415x250-IndiaHerald.jpgతిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కథలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకోగా చివరకు ఈ వివాదం కంచికి చేరింది. తెలుగుదేశం పార్టీ మహిళ మండలాధ్యక్షురాలిపై లైంగిక దాడి కేసు రాజీ బాటలో నడుస్తోందని ఇప్పటికే వెల్లడైంది. ఆదిమూలం తనను వేధించారని చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని స్వయంగా బాధితురాలు వెల్లడించడం కొసమెరుపు. మహిళ తరపు న్యాయవాదికి అందుకు సంబంధించిన అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించడం జరిగింది. koneti adimulam{#}Nijam;Police Station;Telugu Desam Party;District;media;MLA;TDP;Tirupati;Newsకంచికి చేరిన కోనేటి ఆదిమూలం కేసు.. పెద్దల రాజీ ప్రయత్నాలు ఫలించాయిగా!కంచికి చేరిన కోనేటి ఆదిమూలం కేసు.. పెద్దల రాజీ ప్రయత్నాలు ఫలించాయిగా!koneti adimulam{#}Nijam;Police Station;Telugu Desam Party;District;media;MLA;TDP;Tirupati;NewsSat, 21 Sep 2024 09:18:00 GMTతిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కథలో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకోగా చివరకు ఈ వివాదం కంచికి చేరింది. తెలుగుదేశం పార్టీ మహిళ మండలాధ్యక్షురాలిపై లైంగిక దాడి కేసు రాజీ బాటలో నడుస్తోందని ఇప్పటికే వెల్లడైంది. ఆదిమూలం తనను వేధించారని చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని స్వయంగా బాధితురాలు వెల్లడించడం కొసమెరుపు. మహిళ తరపు న్యాయవాదికి అందుకు సంబంధించిన అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించడం జరిగింది.
 
కొన్ని వారాల క్రితం తిరుపతి ఈస్ట్ కోస్ట్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సైతం తెగ వైరల్ అయింది. బాధితురాలు ఆరోపణలు చేసిన తర్వాత తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలను సైతం నిర్వహించారు. అదే సమయంలో టీడీపీ పార్టీకి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడింది.
 
కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా టీడీపీ తమ పార్టీపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడింది. అయితే టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి రాజీ చేశారని సమాచారం అందుతోంది. బాధితురాలు వెనక్కు తగ్గడానికి డబ్బే కారణమా? ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ ను ఎత్తివేయనున్నారని భోగట్టా.
 
కోనేటి ఆదిమూలం ఈ వివాదం నుంచి బయటపడటంతో ఆయన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే ఈ తరహా వివాదాలు పేరు, ప్రతిష్టలను మసకబారుస్తాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తేస్తే ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఈ తరహా ఘటనలు రిపీట్ కాకుండా టీడీపీ నేతలు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>