Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini1ac23cdd-9762-402a-91d1-db480747bbeb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini1ac23cdd-9762-402a-91d1-db480747bbeb-415x250-IndiaHerald.jpgఒక సాదాసీదా బస్ కండక్టర్ స్థాయి నుంచి ఏకంగా కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన రజనీకాంత్ సినీ ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితుడే అన్న విషయం తెలిసిందే. కొన్ని దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హవా నడిపిస్తున్న ఆయన ఇక ఇప్పుడు 70 ప్లస్ వయస్సులో కూడా కుర్ర హీరోలకు దీటుగా వరుసగా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. హిటు ప్లాపులతో సంబంధం లేకుండా ఇక వరుసగా సినిమాలో నటిస్తూ ఉన్నాడు. అయితే మొన్నటి వరకు వరుస ప్లాపులతో సతమతమైన రజిని ఇక జైలర్ అనే rajini{#}Komaram Bheem;Conductor;Rajani kanth;Amitabh Bachchan;Audio;Success;Audience;bollywood;Prakash Raj;Blockbuster hit;temple;Director;Cinemaచంపడమే ఆయన పని.. వేట్టయాన్ లో రజిని పాత్ర ఇదేనట?చంపడమే ఆయన పని.. వేట్టయాన్ లో రజిని పాత్ర ఇదేనట?rajini{#}Komaram Bheem;Conductor;Rajani kanth;Amitabh Bachchan;Audio;Success;Audience;bollywood;Prakash Raj;Blockbuster hit;temple;Director;CinemaSat, 21 Sep 2024 10:30:00 GMTఒక సాదాసీదా బస్ కండక్టర్ స్థాయి నుంచి ఏకంగా కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన రజనీకాంత్ సినీ ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితుడే అన్న విషయం తెలిసిందే. కొన్ని దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హవా నడిపిస్తున్న ఆయన ఇక ఇప్పుడు 70 ప్లస్ వయస్సులో కూడా కుర్ర హీరోలకు దీటుగా వరుసగా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. హిటు ప్లాపులతో సంబంధం లేకుండా ఇక వరుసగా సినిమాలో నటిస్తూ ఉన్నాడు. అయితే మొన్నటి వరకు వరుస ప్లాపులతో సతమతమైన రజిని ఇక జైలర్ అనే మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేసాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన రజనీకాంత్.. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా ఇప్పటికే లైన్లో పెట్టేసాడు ఈ స్టార్ హీరో. వెటయాన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. జై భీమ్ లాంటి ఒక వైవిధ్యమైన సినిమాతో  బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన డైరెక్టర్ జ్ఞానవెల్ ఈ మూవీకి దర్శకుడుగా ఉండడంతో.. ఇక ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ సినిమాతో జ్ఞానవేల్  ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాడు అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు . కాగా ఈ సినిమాలో అటు బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే వెట్టయాన్ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ క్రమంలోనే ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాత్ర ఏంటి అన్న విషయాన్ని మూవీ టీం వెల్లడించింది. ఈ సినిమాలో చంపడమే ఆయన పని అన్నట్లుగా ఉంటుందట రజనీ పాత్ర. ఏకంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించబోతున్నారట రజిని. అయితే ఆయన పని విధానం నచ్చని బాస్ పాత్రలో అమితాబ్ నటించారట. ఇక అమితా పాత్రకి ప్రకాష్ రాజ్ డబ్బింగ్ చెప్పారు అన్నది తెలుస్తోంది. కాగా ఈ మూవీలో రానా, మంజు వారియర్, ఫహద్ ఫాసిల్ లాంటి విలక్షణ నటులు కూడా కనిపించబోతూ ఉండడంతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>