MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-84d26f85-6843-4c5d-91a2-a807d16db3b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-84d26f85-6843-4c5d-91a2-a807d16db3b9-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాలో మరొకరు నటించడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. అలా ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాలో మరొకరు నటించినట్లయితే ఆ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న లేక ఆ సినిమాలో రిజక్ట్ చేసిన పాత్రకు సూపర్ క్రేజ్ వచ్చిన ఆ సినిమా చేసుంటే బాగుండేది అని అనుకుంటారు. అదే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన , ఆ పాత్రకు ఏ మాత్రం గుర్తింపు రాకపోయిన ఆ సినిమాను రిజెక్ట్ చేసే చాలా మంచి పని చేసాం అనుకుంటూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయTollywood {#}rakul preet singh;Samantha;BEAUTY;srinu vytla;Pawan Kalyan;Cinema;Tollywoodసమంత రిజెక్ట్ చేసిన మూవీతో రకుల్ కు పెద్ద ఫ్లాప్.. అందుకే ఆ బ్యూటీ రిజెక్ట్ చేసిందా..?సమంత రిజెక్ట్ చేసిన మూవీతో రకుల్ కు పెద్ద ఫ్లాప్.. అందుకే ఆ బ్యూటీ రిజెక్ట్ చేసిందా..?Tollywood {#}rakul preet singh;Samantha;BEAUTY;srinu vytla;Pawan Kalyan;Cinema;TollywoodSat, 21 Sep 2024 14:58:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాలో మరొకరు నటించడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. అలా ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాలో మరొకరు నటించినట్లయితే ఆ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న లేక ఆ సినిమాలో రిజక్ట్ చేసిన పాత్రకు సూపర్ క్రేజ్ వచ్చిన ఆ సినిమా చేసుంటే బాగుండేది అని అనుకుంటారు. అదే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన , ఆ పాత్రకు ఏ మాత్రం గుర్తింపు రాకపోయిన ఆ సినిమాను రిజెక్ట్ చేసే చాలా మంచి పని చేసాం అనుకుంటూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరు అయినటువంటి సమంత ఓ సినిమాను రిజెక్ట్ చేయగా ఆ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

ఇక సమంత రిజెక్ట్ చేసిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో రకుల్ ప్రీత్ సింగ్ ఓ పెద్ద ఫ్లాప్ కెరియర్ లో పడిపోయింది. ఆ సినిమా ఏమిటి అనుకుంటున్నారా..? అదే బ్రూస్ లీ. కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. మంచి అంచనాలు విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో రకుల్ చేసిన పాత్ర కోసం మొదట మూవీ బృందం సమంత ను అప్రోచ్ అయ్యిందట.

కథ మొత్తం విన్న ఈ బ్యూటీ వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. ఆ తర్వాత రకుల్ ను ఈ మూవీ బృందం వారు సంప్రదించడం , ఆమెకు కథ మొత్తం వివరించగా స్టోరీ నచ్చడంతో రకుల్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. దానితో ఈ మూవీ లో ఈమెను హీరోయిన్గా సెలెక్ట్ చేశారట. అలా సమంత రిజెక్ట్ చేసిన పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించి ఓ ఫ్లాప్ ను అందుకుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>