Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/-deepika-pilli-images-in-show415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/-deepika-pilli-images-in-show415x250-IndiaHerald.jpgటిక్ టాక్ తో పాపులర్ అయిన చాలామంది స్మాల్ స్క్రీన్ ఛాన్సులు అందుకునారు. అలాంటి వారిలో దీపిక పిల్లి ఒకరు. ముందు ఢీ షోలో మెంటర్ గా అవకాశం దక్కించుకున్న దీపిక ఆ క్రేజ్ తో కొన్ని షోస్ కి యాంకర్ గా కూడా ప్రమోట్ అయ్యింది. ఐతే రెండు మూడు ఛానెల్స్ మారి తన సత్తా చాటిన అమ్మడు ఆహాలో సుధీర్ తో కలిసి ఒక షో చేసింది. ఆమధ్య వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో Deepika Pilli{#}deepika;sudigali sudheer;media;Wanted;Audienceస్టార్ యాంకర్ మిస్సింగ్.. ఏం జరిగింది..?స్టార్ యాంకర్ మిస్సింగ్.. ఏం జరిగింది..?Deepika Pilli{#}deepika;sudigali sudheer;media;Wanted;AudienceSat, 21 Sep 2024 23:45:00 GMTటిక్ టాక్ తో పాపులర్ అయిన చాలామంది స్మాల్ స్క్రీన్ ఛాన్సులు అందుకునారు. అలాంటి వారిలో దీపిక పిల్లి ఒకరు. ముందు ఢీ షోలో మెంటర్ గా అవకాశం దక్కించుకున్న దీపిక ఆ క్రేజ్ తో కొన్ని షోస్ కి యాంకర్ గా కూడా ప్రమోట్ అయ్యింది. ఐతే రెండు మూడు ఛానెల్స్ మారి తన సత్తా చాటిన అమ్మడు ఆహాలో సుధీర్ తో కలిసి ఒక షో చేసింది. ఆమధ్య వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో నటించిన దీపికా ఆ తర్వాత మళ్లీ ఛాన్సులు అందుకోలేదు.

సోషల్ మీడియా క్రేజ్ తో స్మాల్ స్క్రీన్ ఛాన్సులు అందుకున్న అమ్మడు ఇప్పుడు అదే సోషల్ మీడియాని నమ్ముకుని ఉంది. సినిమాలు, షోస్ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో తన ఇన్ స్టాగ్రాం లో ఫోటోలతో సరిపెట్టుకుంటుంది. కొంతకాలంగా అమ్మడు ఏ షోలోను కనిపించలేదు. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి తప్ప మిగతా వారికి కనిపించడం మానేసిన దీపిక కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

బుల్లితెర ఆడియన్స్ కు బాగా పరిచయం ఉన్న దీపిక పిల్లి మళ్లీ వరుస షోస్ చేయాలని కోరుతున్నారు. ఐతే ఈమధ్య అమ్మడు బొత్తిగా నల్లపూస అవ్వడంతో వేర్ ఈజ్ దీపిక పిల్లి, స్టార్ యాంకర్ మిస్సింగ్ అనే ట్యాగ్స్ తో ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అవకాశాలు లేక చేయట్లేదా లేదా కావాలని దూరంగా ఉంటుందా అన్నది తెలియదు కానీ దీపిక పిల్లిని మాత్రం బుల్లితెర ప్రేక్షకులు మిస్ అవుతున్నారని చెప్పొచ్చు. అమ్మడు మళ్లీ మునుపటిలా వరుస షోలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని ఆమె ఫాలోవర్స్ ఆశిస్తున్నారు. సో దీపిక కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా కెరీర్ పరంగా కూడా కాస్త సెట్ రైట్ చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు.  ఛాన్సుల విషయంలో దీపిక పిల్లి ఏం ఆలోచిస్తుంది అన్నది ఆమె మీడియా ముందుకు వస్తేనే తెలుస్తుంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>