Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini4c65d30e-7cb4-48cb-9959-da9706e0f05b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini4c65d30e-7cb4-48cb-9959-da9706e0f05b-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సూపర్ గా యాక్షన్స్ సన్నివేశాలు చేసి ప్రేక్షకులందరికీ విజిల్స్ వేయించే హీరోలు ఎంతో మంది ఉన్నా... వైవిద్యమైన పాత్రలు చేస్తూ ఏ పాత్ర చేసిన ఆ పాత్రకు ప్రాణం పోసే విలక్షణ నటులు మాత్రం కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి నటులు ఇక ఎప్పుడూ కమర్షియల్ సినిమాలు చేయాలని ఆలోచించకుండా వైవిద్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను తమ నటనతో ప్రతిక్షణం సర్ప్రైజ్ చేయాలి అని ఆశపడుతూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో కూడా అలాంటి నటులు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయrajini{#}Daggubati Venkateswara Rao;Rajani kanth;Audio;Venkatesh;rana daggubati;Tollywood;Hero;Cinemaరజనీకాంత్.. నా హాస్పిటల్ మేట్ : రానారజనీకాంత్.. నా హాస్పిటల్ మేట్ : రానాrajini{#}Daggubati Venkateswara Rao;Rajani kanth;Audio;Venkatesh;rana daggubati;Tollywood;Hero;CinemaSat, 21 Sep 2024 10:00:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సూపర్ గా యాక్షన్స్ సన్నివేశాలు చేసి ప్రేక్షకులందరికీ విజిల్స్ వేయించే హీరోలు ఎంతో మంది ఉన్నా... వైవిద్యమైన పాత్రలు చేస్తూ ఏ పాత్ర చేసిన ఆ పాత్రకు ప్రాణం పోసే విలక్షణ నటులు మాత్రం కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి నటులు ఇక ఎప్పుడూ కమర్షియల్ సినిమాలు చేయాలని ఆలోచించకుండా వైవిద్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను తమ నటనతో ప్రతిక్షణం సర్ప్రైజ్ చేయాలి అని ఆశపడుతూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో కూడా అలాంటి నటులు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన రానా కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. కెరియర్ తొలినాళ్ల నుంచి అందరిలా కాకుండా డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ వస్తున్నాడు రానా.


 ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే ఇంకోవైపు ఇతర హీరోల సినిమాల్లో వైవిద్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఏ పాత్ర పోషించిన ఆ పాత్రకి ప్రాణం పోస్తూ రానా అని చూపించిన నట విశ్వరూపం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది అని చెప్పాలి. అందుకే రానాని వెర్సటైల్ యాక్టర్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు సినీ ప్రేక్షకులు. అయితే అలాంటి రానా ఇక ఇప్పుడు రజినీకాంత్ హీరోగా నటిస్తున్న వెట్టయాన్ సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే మూవీకి సంబంధించి ఇటీవల ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరగగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రానా రజనీకాంత్ తో ఉన్న తన అనుబంధాన్ని విచిత్రంగా అభివర్ణించాడు.


 సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ నాకు హాస్పిటల్ మెట్ అంటూ చెప్పారు రానా. ఎంతోమందికి క్లాస్మేట్స్ ఉంటారు.. రూమ్మేట్స్ ఉంటారు .. కానీ రజిని సార్ నాకు హాస్పిటల్ మేట్ అంటూ తెలిపారు. ఎందుకు గల కారణం కూడా ఏంటో చెప్పేశాడు. కష్టకాలంలో ఉన్నప్పుడు రజనీకాంత్ అండగా నిలిచారని హీరో రానా అన్నాడు. గతంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యా. మళ్లీ నటిస్తానని అనుకోలేదు. ఆ టైంలో రజనీ సర్ నాతో గంట పాటు మాట్లాడి.. నాలో స్ఫూర్తిని నింపారు. దీంతో నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. అందుకే అందరికీ క్లాస్మేట్స్ రూమ్మేట్స్ ఉంటే రజిని సార్ నా హాస్పిటల్ మేట్ గా మారిపోయారు అంటూ రానా చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>