PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/amith-shaa-80b1164d-dc82-4567-98bd-22f619d876dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/amith-shaa-80b1164d-dc82-4567-98bd-22f619d876dd-415x250-IndiaHerald.jpgమావోయిస్టులు హింసను విడనాడాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలేసి సరెండర్ కావాలని సూచించారు. తన ప్రతిపాదనను పట్టించుకోకపోతే నక్సల్స్ పై ఆలౌట్ ఆపరేషన్ మొదలు పెడతానని హెచ్చరించారు. 2026 మార్చి నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. దిల్లీలో బస్తర్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద హింసాకాండ బాధితులతో మాట్లాడిన హోం మంత్రి హింసను విడనాడాలని ఆయుధాలు వదిలి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఙప్తి చేశారు. నక్సల్స్ హింస, భావజాలాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని amith shaa {#}Nepal;Narendra Modi;Mohandas Karamchand Gandhi;Prime Minister;March;MP;central government;Tirupati;Minister;Husbandమావోయిస్టులకు అమిత్ షా మాస్ వార్నింగ్..! మాట వినకపోతే ఆల్ అవుట్ అవుతారుమావోయిస్టులకు అమిత్ షా మాస్ వార్నింగ్..! మాట వినకపోతే ఆల్ అవుట్ అవుతారుamith shaa {#}Nepal;Narendra Modi;Mohandas Karamchand Gandhi;Prime Minister;March;MP;central government;Tirupati;Minister;HusbandSat, 21 Sep 2024 12:09:00 GMTమావోయిస్టులు హింసను విడనాడాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలేసి సరెండర్ కావాలని సూచించారు. తన ప్రతిపాదనను పట్టించుకోకపోతే నక్సల్స్‌ పై ఆలౌట్ ఆపరేషన్ మొదలు పెడతానని హెచ్చరించారు. 2026 మార్చి నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు.


దిల్లీలో బస్తర్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద హింసాకాండ బాధితులతో మాట్లాడిన హోం మంత్రి హింసను విడనాడాలని ఆయుధాలు వదిలి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఙప్తి చేశారు. నక్సల్స్ హింస, భావజాలాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని అన్నారు.  ఈశాన్య ప్రాంతంలోని మిలిటెంట్ల చేసినట్లుగా హింసను విడనాడాలని ఆయుధాలు విడనాడి లొంగిపోవాలని అన్నారు. మీరు వినకపోతే.. ముప్పును అంతం చేయడానికి త్వరలో ఆల్ అవుట్ ఆపరేషన్ ను నిర్వహించబోతున్నాం అని షా చెప్పారు.


ఈ సమస్య ఇప్పుడు ఛత్తీస్ గఢ్ లో నాలుగు జిల్లాలకే పరిమితం అయిందని మావోయిస్టులు జరిపిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించాయని ఆయన వివరించారు. ఛత్తీస్ గఢ్ కి 55 మంది మావోయిస్టు బాధితులను ఉద్దేశించి గాంధీ నగర్ ఎంపీ అమిత్ షా మాట్లాడుతూ.. మేము ఈ దేశం నుంచి నక్సలిజాన్ని నక్సలిజం ఆలోచనను నిర్మూలించి శాంతిని నెలకొల్పుతాము అని పేర్కొన్నారు.


పశు పతి నాథ్ నేపాల్ నుంచి తిరుపతి  వరకు కారిడార్ ఏర్పాటు చేయాలని మావోయిస్టులకు ఒకప్పుడు అనుకున్నారని, అయితే మోదీ ప్రభుత్వం దానిని ధ్వంసం చేసిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో సన్నిహిత సమన్వయంతో ఛత్తీస్ గఢ్ లోని నక్సల్స్ హింసాకాండ బాధిత ప్రజల కోసం వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో సంక్షేమ పథకాన్ని రూపొందించనుంది. ఉద్యోగాలు, ఆరోగ్య , సంరక్షణ, ఇతర రంగాల్లో మా సంక్షేమ చర్యల ద్వారా మేము మీకు ఏ విధంగానైనా సాయం చేస్తాం అని అమిత్‌ షా చెప్పారు. కాగా ఇప్పటికే మావోయిస్టులను  కేంద్రం ఏరివేస్తున్న  విషయం తెలిసిందే. 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>