Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jani7daecc6e-b138-4f7c-b962-5b8d90b28643-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jani7daecc6e-b138-4f7c-b962-5b8d90b28643-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి సౌత్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అటు జానీ మాస్టర్ పేరు ఎంతలా వైరల్ గా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జానీ మాస్టర్ దగ్గర ఎన్నో ఏళ్ల పాటు అసిస్టెంట్ గా పని చేసిన శ్రేష్టి వర్మ ఏకంగా జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడు అంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక ఈ కేసును జానీ మాస్టర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో ఆ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలోనే ఏకంగా శ్రేష్టి వర్మ పదహారేళ్ల వయస్సు ఉన్నప్పుడే తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడంటjani{#}Master;Traffic police;Ram Gopal Varma;johnny;Johnny;Police Station;India;Indianజానీ మాస్టర్.. ఒక్క పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా?జానీ మాస్టర్.. ఒక్క పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా?jani{#}Master;Traffic police;Ram Gopal Varma;johnny;Johnny;Police Station;India;IndianSat, 21 Sep 2024 10:45:00 GMTగత కొంతకాలం నుంచి సౌత్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అటు జానీ మాస్టర్ పేరు ఎంతలా వైరల్ గా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జానీ మాస్టర్ దగ్గర ఎన్నో ఏళ్ల పాటు అసిస్టెంట్ గా పని చేసిన శ్రేష్టి వర్మ ఏకంగా జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడు అంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక ఈ కేసును జానీ మాస్టర్ నార్సింగి  పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో ఆ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలోనే ఏకంగా శ్రేష్టి వర్మ పదహారేళ్ల వయస్సు ఉన్నప్పుడే తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు చేయడంతో.. ఇక ఈ టాప్ కొరియోగ్రాఫర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.


 ఈ క్రమంలోనే జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు అన్న విషయం తెలిసిందే. 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. అయితే రెండుసార్లు నేషనల్ అవార్డును సొంతం చేసుకొని పాన్ ఇండియా లెవెల్లో స్టార్ కొరియోగ్రాఫర్ గా కెరియర్ను సాగిస్తున్న జానీ మాస్టర్ ఇలా అత్యాచారం ఆరోపణలు ఎదుర్కోవడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ కు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ ఒక్కో పాటకి ఎంత పారితోషకం తీసుకునేవాడు అనే విషయం కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.


 ఒక సైడ్ డాన్సర్ దగ్గర నుంచి ఏకంగా టాప్ కొరియోగ్రాఫర్ స్థానానికి ఎదగడానికి జానే మాస్టర్ చాలా కష్టపడ్డాడు. ఇక ఇప్పుడు కొరియోగ్రాఫర్ అందరిలో కూడా టాప్ లో కొనసాగుతున్న జాని మాస్టర్ ఒక్కో పాటకి 50 లక్షల రూపాయలకు పైగా పారితోషకం తీసుకుంటాడట. అయితే ఈ స్థాయి రెమ్యునరేషన్ ఇండియాలో ఇప్పటివరకు ఏ కొరియోగ్రాఫర్ తీసుకోవట్లేదు. ఒక సినిమాలో ఆరు పాటలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తే ఏకంగా మూడు కోట్ల రూపాయల పారితోషకం అందుతుందట. అయితే కేవలం స్టార్ హీరోలకు మాత్రమే కాదు చిన్న చిన్న హీరోలకి కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఇక కొన్ని సినిమాలు కోసం అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే పని చేశాడట. చిన్న సినిమాలుకు కేవలం 10 లక్షలు మాత్రమే చార్జ్ చేస్తూ ఉంటాడట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>