MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-tweet-means-to-far-way-from-chandrababu-naidu7c953c5e-fe9c-4bac-bf03-de372e2f7859-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-tweet-means-to-far-way-from-chandrababu-naidu7c953c5e-fe9c-4bac-bf03-de372e2f7859-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు పూర్తిగా దూరమయ్యారా? అని ప్రశ్నిస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తారక్ చాలా నెలలుగా టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ తరఫున ప్రచారం చేయలేదు. చంద్రబాబు సతీమణి అవమానించినప్పుడు కూడా ఆశించిన స్థాయిలో రెస్పాండ్ కాలేదు. బాబును జైల్‌లో వేసినప్పుడు కూడా తారక్ అతనికి సపోర్టు ప్రకటించలేదు. బాబాయి బాలకృష్ణకు కూడా ఎన్టీఆర్ దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఈ యంగ్ టైగర్ ఇలా పట్టించుకోకపోయినా వాళ్లు మాత్రం ఇప్పుడు ఎన్టీఆర్‌కdevara movie{#}kalyan ram;Party;september;TDP;CM;CBN;Telugu;Jr NTR;Minister;Andhra Pradesh;Deputy Chief Minister;kalyan;NTR;Cinemaచంద్ర‌బాబుతో మావ‌య్య బంధం తెంపేసుకున్న ఎన్టీఆర్‌... ఆ ట్వీట్‌కు అర్థం అదేనా..?చంద్ర‌బాబుతో మావ‌య్య బంధం తెంపేసుకున్న ఎన్టీఆర్‌... ఆ ట్వీట్‌కు అర్థం అదేనా..?devara movie{#}kalyan ram;Party;september;TDP;CM;CBN;Telugu;Jr NTR;Minister;Andhra Pradesh;Deputy Chief Minister;kalyan;NTR;CinemaSat, 21 Sep 2024 15:34:00 GMT
జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు పూర్తిగా దూరమయ్యారా? అని ప్రశ్నిస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తారక్ చాలా నెలలుగా టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ తరఫున ప్రచారం చేయలేదు. చంద్రబాబు సతీమణి అవమానించినప్పుడు కూడా ఆశించిన స్థాయిలో రెస్పాండ్ కాలేదు. బాబును జైల్‌లో వేసినప్పుడు కూడా తారక్ అతనికి సపోర్టు ప్రకటించలేదు. బాబాయి బాలకృష్ణకు కూడా ఎన్టీఆర్ దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఈ యంగ్ టైగర్ ఇలా పట్టించుకోకపోయినా వాళ్లు మాత్రం ఇప్పుడు ఎన్టీఆర్‌కు మంచే చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

" style="height: 380px;">


తారక్ హీరోగా నటించిన "దేవర" సినిమా ఈనెల 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఎక్కువ షోస్ ఎక్కువ టికెట్ రేట్లు పెట్టుకునే లాగా అనుమతించాలంటూ మూవీ టీమ్‌ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. దానికి టీడీపీ సర్కార్ చాలా సానుకూలంగా స్పందించింది. కోరినంత, కావాల్సినంత సౌలభ్యాన్ని కల్పించింది. టికెట్ రేట్లను నచ్చినట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతే కాదు మిడ్ నైట్ షోలు వేసుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో రిలీజ్ రోజునే దేవర మూవీ ఆరు షోల్లో ప్రదర్శితమవుతుంది. రెండో రోజు నుంచి ఐదు షోలు వేసుకోవచ్చు.

తొమ్మిది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. అదనపు షోలతో దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున కలెక్షన్లను రాబట్టవచ్చు. ఏపీలో దేవర సినిమాకి ఆంక్షలు లేకుండా పోయాయి. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ ప్రకారం, దేవర మూవీ టీమ్‌ మల్టీప్లెక్సులో టికెట్ రేట్‌ను రూ.135 వరకు పెంచుకోవచ్చు. సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ రేట్లను గరిష్టంగా రూ.110 వరకూ, దిగువ క్లాస్ టికెట్ ధరలు రూ.60 మేర నిర్ణయించవచ్చు. సెప్టెంబర్ 26 అర్దరాత్రి దాటిన వెంటనే ఫస్ట్ షో పడిపోతుంది. సెప్టెంబర్ 27న ఏపీ అంతటా ఆరు షోలు వేస్తారు. తర్వాత 5 షోలు మాత్రమే నడుస్తాయి. తమ సినిమాకు ఇన్ని సౌలభ్యాలు కల్పించిన ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కళ్యాణ్ రామ్ తో పాటు ఎన్టీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

"దేవర విడుదల కోసం కొత్త జి.ఓను ఆమోదించినందుకు, తెలుగు సినిమాకి నిరంతర మద్దతు ఇస్తున్నందుకు గౌరవనీయులైన సీఎం @NCBN గారు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.  సినిమాటోగ్రఫీ మంత్రి కందులదుర్గేష్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను." అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. కళ్యాణ్ రామ్ కూడా దాదాపు ఇలానే ట్విట్ చేశాడు. ఈ ట్వీట్స్‌లో చంద్రబాబును మామయ్య లేదా మామయ్య గారు అని ఎక్కడా పిలవలేదు. సీఎం చంద్రబాబు తారక్‌కు వరుసకు మామయ్య అవుతారు. Cbn అని అనడం కంటే మామయ్య అని పిలిచి బాబుపై తన ఆత్మీయతను ఎన్టీఆర్ చూపించి ఉంటే బాగుండేది. టీడీపీ తమ్ముళ్లు అందరూ ఖుషిగా ఫీల్ అయి ఉండేవారు. జూనియర్ ఎన్టీఆర్‌కి ఎప్పటికీ చంద్రబాబు అంటే ప్రేమే ఉందని, వారి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని సంబరపడిపోయేవారు కానీ అలా జరగలేదు. దీంతో మామయ్య అనే బంధాన్ని ఎన్టీఆర్ పూర్తిగా తెంచేసుకున్నాడేమో అని పలు అభిప్రాయపడుతున్నారు.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>