MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం వరకు సంక్రాంతి రేస్ విజేతగా నిలిచిన శర్వానంద్ కొంతకాలం మినిమం గ్యారెంటీ హీరోగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఆతరువాత విడుదలైన అతడి సినిమాలు వరసపెట్టి ఫెయిల్ అవ్వడంతో శర్వానంద్ మార్కెట్ బాగా పడిపోయింది. అయితే ఆమధ్య వచ్చిన ‘ఒకే ఒక్క జీవితం’ విజయం సాధించడంతో తిరిగి అనేకమంది దర్శక నిర్మాతలు శర్వానంద్ వైపు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య శర్వానంద్ 60 సంవత్సరాలు వెనక్కు వెళ్ళే అవకాశం లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కొంతకాలం క్రితం సాయి ధరమ్ తేజ్ హsarwanand{#}Pooja Hegde;jeevitha rajaseskhar;sai dharam tej;sampath nandi;Makar Sakranti;Audience;Director;vegetable market;News;Darsakudu;Ram Charan Teja;Cinema60 సంవత్సరాలు వెనక్కు వెళ్ళిన శర్వానంద్ !60 సంవత్సరాలు వెనక్కు వెళ్ళిన శర్వానంద్ !sarwanand{#}Pooja Hegde;jeevitha rajaseskhar;sai dharam tej;sampath nandi;Makar Sakranti;Audience;Director;vegetable market;News;Darsakudu;Ram Charan Teja;CinemaFri, 20 Sep 2024 09:06:00 GMTకొన్ని సంవత్సరాల క్రితం వరకు సంక్రాంతి రేస్ విజేతగా నిలిచిన శర్వానంద్ కొంతకాలం మినిమం గ్యారెంటీ హీరోగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఆతరువాత విడుదలైన అతడి సినిమాలు వరసపెట్టి ఫెయిల్ అవ్వడంతో శర్వానంద్ మార్కెట్ బాగా పడిపోయింది. అయితే ఆమధ్య వచ్చిన ‘ఒకే ఒక్క జీవితం’ విజయం సాధించడంతో తిరిగి అనేకమంది దర్శక నిర్మాతలు శర్వానంద్ వైపు చూస్తున్నారు.



ఇలాంటి పరిస్థితుల మధ్య శర్వానంద్ 60 సంవత్సరాలు వెనక్కు వెళ్ళే అవకాశం లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కొంతకాలం క్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ అనే సినిమాను భారీ బడ్జెట్ తో తీయాలని సంపత్ నంది గట్టి ప్రయాయత్నాలు చేశాడు. ఈ మూవీలో పూజా హెగ్డే నటిస్తుందని వార్తలు కూడ వచ్చాయి. అయితే ఈమధ్య కాలంలో సాయి తేజ్ సినిమా మార్కెట్ కొంతవరకు తగ్గడంతో పాటు ఈ మూవీ టైటిల్ పై కొన్ని వివాదాలు తలెత్తడంతో ఈ మూవీ నిర్మాణం వాయిదా వేశారు.



ఇప్పుడు దర్శకుడు సంపత్ నంది ఈ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టి శర్వానంద్ తో ఒక మూవీ తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు 60 సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలను ఆధారంగ చేసుకుని సంపత్ నంది ఈమూవీ స్క్రిప్ట్ వ్రాసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ అభిలాష్ డైరెక్షన్ లో ఒక మూవీ రామ్ అబ్బరాజు తో మరొక మూవీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.



దర్శకుడు సంపత్ నందికి ఒక సరైన హిట్ కావాలి. రామ్ చరణ్ తో కొన్ని సంవత్సరాల క్రితం తీసిన మూవీ తరువాత అతడికి చెప్పుకోతగ్గ హిట్ దక్కలేదు. ఈమధ్య కాలంలో పీరియాడిక్ కథలతో తీసిన సినిమాలను ప్రేక్షకులు బాగా చూస్తున్నారు. ఈ ట్రెండ్ ను పసికట్టిన సంపత్ నంది ఈ ప్రయోగం శర్వానంద్ తో చేస్తున్నాడు అనుకోవాలి..  












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>