MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli196aeeed-72cf-40aa-90c6-28b62b9f872f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli196aeeed-72cf-40aa-90c6-28b62b9f872f-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి రాజమౌళి ఇప్పటివరకు ఎప్పుడు కూడా తాను రాసుకున్న కథతో సినిమా చేయలేదు. ఎక్కువ శాతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమాలకు తన తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథలను అందిస్తూ ఉంటాడు. దానితో ఆయన రాసిన కథల్లో నుండి ఆయనకు నచ్చిన కథను సెలెక్ట్ చేసుకుని రాజమౌళి సినిమాలను చేస్తూ ఉంటాడు. ఇకపోతే సింహాద్రి మూవీ రాజమౌళి కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథను విజయేంద్ర ప్రసాద్ బాలకృష్ణ కోసం రRajamouli{#}K V Vijayendra Prasad;Magadheera;Simhadri;Ram Charan Teja;Balakrishna;Father;Industry;Rajamouli;NTR;krishna;Tollywood;Cinemaఅన్ని సంవత్సరాలు పక్కన పడేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన రాజమౌళి.. అందుకే ఆయన గ్రేట్..?అన్ని సంవత్సరాలు పక్కన పడేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన రాజమౌళి.. అందుకే ఆయన గ్రేట్..?Rajamouli{#}K V Vijayendra Prasad;Magadheera;Simhadri;Ram Charan Teja;Balakrishna;Father;Industry;Rajamouli;NTR;krishna;Tollywood;CinemaFri, 20 Sep 2024 08:10:00 GMTప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి రాజమౌళి ఇప్పటివరకు ఎప్పుడు కూడా తాను రాసుకున్న కథతో సినిమా చేయలేదు. ఎక్కువ శాతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమాలకు తన తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథలను అందిస్తూ ఉంటాడు. దానితో ఆయన రాసిన కథల్లో నుండి ఆయనకు నచ్చిన కథను సెలెక్ట్ చేసుకుని రాజమౌళి సినిమాలను చేస్తూ ఉంటాడు. ఇకపోతే సింహాద్రి మూవీ రాజమౌళి కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథను విజయేంద్ర ప్రసాద్ బాలకృష్ణ కోసం రాశారు.

కానీ ఆయనకు ఆ స్టోరీ పెద్దగా నచ్చకపోవడంతో విజయేంద్ర ప్రసాద్ ఆ కథని పక్కన పెట్టేశారట. ఇక రాజమౌళి కి ఆ స్టోరీ అద్భుతంగా నచ్చడంతో ఎన్టీఆర్ తో ఆ కథతో మూవీ తీస్తే బాగుంటుంది అని సింహాద్రి అనే టైటిల్ తో ఆ కథతో సినిమా చేశారట. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమా విషయంలోనే కాదు రాజమౌళి దర్శకత్వంలో రూపొంది టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మగధీర సినిమా విషయంలో కూడా దాదాపు ఇలాంటి సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... చాలా సంవత్సరాల క్రితం విజయేంద్ర ప్రసాద్ "మగధీర" కథను సూపర్ స్టార్ కృష్ణ కోసం రాసారట. సాగర్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా జగదేక వీరుడు అనే టైటిల్ తో ఈ సినిమాను చేయాలి అని అనుకున్నారట.

ఇక ఈ కథను విజయేంద్ర ప్రసాద్ , కృష్ణ కి వినిపించగా ఆయనకు మాత్రం ఈ స్టోరీ పెద్దగా నచ్చలేదట. దానితో విజయేంద్ర ప్రసాద్ ఈ స్టోరీని పక్కన పడేసాడట. ఇక చాలా సంవత్సరాల తర్వాత రాజమౌళికి , రామ్ చరణ్ తో సినిమా సెట్ కావడంతో రాజమౌళి  , కృష్ణ రిజెక్ట్ చేసిన కథ చరణ్ కు బాగుంటుంది అని దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి చరణ్ , చిరంజీవికి వినిపించడం , వారికి అది నచ్చడంతో మగధీర అనే టైటిల్ తో దానిని రూపొందించినట్లు తెలుస్తోంది. అలా కృష్ణ రిజెక్ట్ చేసిన కథతో రామ్ చరణ్ ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ నే అందుకున్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>