PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/what-strategies-jagan-will-come-up-with-to-win-the-elections20741392-9566-4ca3-9967-2b1acb5512ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/what-strategies-jagan-will-come-up-with-to-win-the-elections20741392-9566-4ca3-9967-2b1acb5512ff-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా కొన్ని వార్తలు జోరుగా ప్రచారంలోకి రాగా మరికొన్ని వార్తలు నిజమేనని వెల్లడైంది. గతేడాది జూన్ 16వ తేదీన గురుడాద్రి క్వార్టర్స్ దగ్గర అన్యమత ప్రచార స్టిక్కర్ ఉన్న కారును నిలిపారు. tirumala{#}police;Tirupati;Car;News;YCP;June;Sakshi;Tirumala Tirupathi Devasthanamజగన్ పాలనలో తిరుమలలో అన్యమత ప్రచారం.. ఆ మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ?జగన్ పాలనలో తిరుమలలో అన్యమత ప్రచారం.. ఆ మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ?tirumala{#}police;Tirupati;Car;News;YCP;June;Sakshi;Tirumala Tirupathi DevasthanamFri, 20 Sep 2024 08:25:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా కొన్ని వార్తలు జోరుగా ప్రచారంలోకి రాగా మరికొన్ని వార్తలు నిజమేనని వెల్లడైంది. గతేడాది జూన్ 16వ తేదీన గురుడాద్రి క్వార్టర్స్ దగ్గర అన్యమత ప్రచార స్టిక్కర్ ఉన్న కారును నిలిపారు.
 
భద్రతా సిబ్బంది మాత్రం ఆ కారు గురించి పెద్దగా పట్టించుకోకపోవడంపై ఆ సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో పాటు భక్తులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సాధారణంగా అన్య మతానికి సంబంధించిన ప్రచారం కాని, స్టిక్కర్లు కానీ తిరుమలలోకి అనుమతించకూడదని నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఒక మతానికి సంబంధించిన జాబ్స్ ఇవ్వకూడదనే నిబంధన ఉన్నా ఆ నిబంధనను సైతం ఉల్లంఘించారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
 
తిరుమలలో అన్యమత ప్రచారం చేసిన కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా అప్పట్లో ఒకింత సంచలనం అయింది. అయితే వైసీపీకి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో ఆ సమయంలో టీటీడీ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. టీటీడీ లడ్డూ విషయంలో సంచలన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గతంలో నెలకొన్న వివాదాలు సైతం వెలుగులోకి వస్తుండటం గమనార్హం.
 
అయితే వైసీపీ వైపు నుంచి ఈ ఆరోపణలకు సరైన కౌంటర్లు మాత్రం రావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు, మాజీ టీటీడీ ఛైర్మన్లు చెబుతున్న విషయాలను సైతం సాక్షి పత్రిక మినహా మరే పత్రిక ప్రచురించడం లేదు. తిరుమల లడ్డూ వివాదం జాతీయ స్థాయిలో సమస్య కావడంతో ఇందుకు సంబంధించి కేసులు నమోదయ్యే అవకాశాలు సైతం ఉన్నాయని చెప్పవచ్చు. వైసీపీ రాజకీయ సమాధి దిశగా కూటమి అడుగులు పడుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>