MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hariharaveeramallu-seqvel-pawan-kalayanc379d1fa-4ac0-4a23-b159-25ca5e53c1eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hariharaveeramallu-seqvel-pawan-kalayanc379d1fa-4ac0-4a23-b159-25ca5e53c1eb-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు అవుతోంది.ఇప్పటికి కూడా ఈ సినిమా విషయం పైన ఎలాంటి క్లారిటీ రాలేదు.. ముఖ్యంగా సినిమా షూటింగ్ కొంత భాగం అయ్యిందని మిగిలిన భాగం నచ్చక రీ షూటింగ్ చేస్తున్నారనే విధంగా వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పొలిటికల్ కారణం చేత ఎక్కువ డేట్లు కేటాయించలేదని కూడా గతంలో వార్తలు వినిపించాయి. అలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ మళ్లీ OG, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలను చేశారు. దీంతో హరిహర వీరHARIHARAVEERAMALLU;SEQVEL;PAWAN KALAYAN{#}News;kalyan;Director;Cinemaపవన్ కళ్యాణ్ తో విరమల్లు -2నా.. సాధ్యమయ్యే పనేనా..?పవన్ కళ్యాణ్ తో విరమల్లు -2నా.. సాధ్యమయ్యే పనేనా..?HARIHARAVEERAMALLU;SEQVEL;PAWAN KALAYAN{#}News;kalyan;Director;CinemaFri, 20 Sep 2024 20:29:00 GMTపవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు అవుతోంది.ఇప్పటికి కూడా ఈ సినిమా విషయం పైన ఎలాంటి క్లారిటీ రాలేదు.. ముఖ్యంగా సినిమా షూటింగ్ కొంత భాగం అయ్యిందని మిగిలిన భాగం నచ్చక రీ షూటింగ్ చేస్తున్నారనే విధంగా వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పొలిటికల్ కారణం చేత ఎక్కువ డేట్లు కేటాయించలేదని కూడా గతంలో వార్తలు వినిపించాయి. అలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ మళ్లీ OG, ఉస్తాద్ భగత్ సింగ్  వంటి చిత్రాలను చేశారు.



దీంతో హరిహర వీరమల్లు సినిమా పైన కూడా ఎన్నో రూమర్స్ వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఈ నెల 23వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ సినిమా డేట్ లో ఇచ్చారని మరో నెలరోజుల పాటు కంటిన్యూ చేస్తే హరిహర వీరమల్లు సినిమా పూర్తి అవుతుందని చిత్ర బృందం భావిస్తోందట. అయితే ఎలాగోలాగా హరిహర వీరమల్లు పూర్తి చేస్తే మళ్లీ సీక్వెల్ కూడా ఉంటుందంటూ మేకర్స్ ప్రకటించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వల్ల రెండవ భాగాన్ని అసలు పూర్తి చేస్తారా అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


మొదటి భాగం పూర్తి చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇక రెండవ భాగం అంటే అంతకుమించి కష్టపడాల్సి ఉంటుందనే విధంగా చెప్పవచ్చు. మొదటి భాగం కోసం పవన్ కళ్యాణ్ కత్తి యుద్ధాన్ని నేర్చుకోవడం జరిగింది.రెండో భాగం అంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది కాబట్టి.. చాలా ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అలాగే ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించాలి. ప్రస్తుతం పొలిటికల్ పరంగా బిజీగా ఉండడం చేత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు-2 చేయడం చాలా కష్టమని కార్యకర్తలు భావిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి పవన్ కళ్యాణ్ ఒక్క ఐదు రోజులు కనిపించక పోయిన యాక్టివ్గా లేకపోయినా ప్రత్యర్థులు సైతం చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ రిస్కు చేస్తారా లేదా అనేది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>