PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/samineni-udayabhanu11e66e03-f5e4-453d-afcb-2d8c61034feb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/samineni-udayabhanu11e66e03-f5e4-453d-afcb-2d8c61034feb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ పార్టీ మారుతున్నారు. ఇప్పటికే చాలామంది పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి రాజీనామా కూడా చేశారు. త్వరలోనే పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆళ్ల నాని అలాగే, దొరబాబు ఇటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి కీలక నేతలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. samineni udayabhanu{#}Nani;srinivas;Mopidevi Venkata Ramana;Jaggayyapeta;wednesday;BALINENI SRINIVASA REDDY;Telangana Chief Minister;Reddy;TDP;Jagan;రాజీనామా;kalyan;YCP;Party;Janasena;Ministerబాలినేని ఒక్కడే కాదు...జనసేనలోకి మరో ముగ్గురు?బాలినేని ఒక్కడే కాదు...జనసేనలోకి మరో ముగ్గురు?samineni udayabhanu{#}Nani;srinivas;Mopidevi Venkata Ramana;Jaggayyapeta;wednesday;BALINENI SRINIVASA REDDY;Telangana Chief Minister;Reddy;TDP;Jagan;రాజీనామా;kalyan;YCP;Party;Janasena;MinisterThu, 19 Sep 2024 11:37:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ పార్టీ మారుతున్నారు. ఇప్పటికే చాలామంది పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి రాజీనామా కూడా చేశారు. త్వరలోనే పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆళ్ల నాని అలాగే, దొరబాబు ఇటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి కీలక నేతలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది.


అయితే వైయస్సార్ కుటుంబ సభ్యులు అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి... బుధవారం రోజున వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇవాళ...  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాత జనసేనలో ఎప్పుడు చేరేది క్లారిటీ ఇవ్వనున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన నచ్చకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు బహిరంగంగానే ప్రకటించారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.


అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి బాటలో.. మరో వైసీపీ కీలక లీడర్.. వెళ్తున్నట్లు తెలుస్తోంది. వైసిపి కీలక నేత సామినేని ఉదయభాను... కూడా వైసిపి నుంచి బయటకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. త్వరలోనే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారట వైసీపీ నేత సామినేని ఉదయభాను. జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి దాదాపు..  మూడుసార్లు విజయం సాధించారు సామినేని ఉదయభాను.

 
మన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా ఆశించి భంగపడ్డారు. అయితే మొన్నటి ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేసిన సామినేని ఉదయభాను.. టిడిపి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇక ఇప్పుడు వైసీపీతో.. బంధం తెంచుకునేందుకు నిర్ణయం తీసుకున్నారట. జనసేనలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారట సామినేని.  అటు మొన్న వైసీపీకి రాజీనామా చేసిన మస్తాన్ రావు, మోపిదేవి కూడా జనసేనలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>