MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaffec458e-c76b-4ce6-bea9-dd82b6661096-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaffec458e-c76b-4ce6-bea9-dd82b6661096-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ రాజకీయాల్లోనూ ఎంతోమంది దూసుకుపోతున్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలనూ బ్యాలెన్స్ చేస్తూ ఉండే నటీనటులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో నందమూరి బాలయ్య బాబు ఒకరు. నందమూరి నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ ను మరింత పెంచిన నటుడు బాలకృష్ణ. అంతటి స్టార్ ఇమేజ్ ను తన సొంతంగా సాధించుకున్న హీరో బాలకృష్ణ. అతను అంటే ప్రతి ఒక్క అభిమానికి విపరీతమైన ఇష్టం. balakrishna{#}Balakrishna;Mass;Telugu;NTR;Hero;Cinemaపంచెకట్టుతో అదరగొట్టిన బాలకృష్ణ..యంగ్ హీరోలా మారుతున్నాడు ?పంచెకట్టుతో అదరగొట్టిన బాలకృష్ణ..యంగ్ హీరోలా మారుతున్నాడు ?balakrishna{#}Balakrishna;Mass;Telugu;NTR;Hero;CinemaThu, 19 Sep 2024 14:12:00 GMTసినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ రాజకీయాల్లోనూ ఎంతోమంది దూసుకుపోతున్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలనూ బ్యాలెన్స్ చేస్తూ ఉండే నటీనటులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో నందమూరి బాలయ్య బాబు ఒకరు. నందమూరి నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ ను మరింత పెంచిన నటుడు బాలకృష్ణ. అంతటి స్టార్ ఇమేజ్ ను తన సొంతంగా సాధించుకున్న హీరో బాలకృష్ణ. అతను అంటే ప్రతి ఒక్క అభిమానికి విపరీతమైన ఇష్టం.


ఎన్టీఆర్ నట వారసుడిగా, నందమూరి బిడ్డగా అతి చిన్న వయసులోనే బాల నటుడుగా సినిమాల్లోకి వచ్చాడు. ప్రస్తుతం మాస్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య బాబు రాజకీయాల్లోనూ రాణిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. మల్టీ టాలెంటెడ్ బాలకృష్ణ అని నిరూపించుకున్నాడు. హీరోగా మాత్రమే కాకుండా, నిర్మాతగా, సింగర్ గా తన సత్తాను సినీ అభిమానులకు పరిచయం చేస్తుంటాడు. బాలకృష్ణ మొదట కెమెరా మెన్ గా కూడా పని చేశాడు. ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహిస్తూ తన కొడుకు బాలకృష్ణకు కెమెరా వర్క్ కూడా నేర్పించారట.


రాజకీయాలు, ప్రజా సేవలో ఎప్పుడూ బిజీగా ఉంటున్న బాలకృష్ణ సినిమాలను అస్సలు వదలడం లేదు. ప్రస్తుతం NBK 109 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అందులో బాలయ్య బాబు పంచకట్టుతో కనిపించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


అందులో బాలకృష్ణ పంచకట్టులో తెలుగు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ క్లీన్ షేవ్ తో హ్యాండ్సమ్ గా కనిపించారు. అంతేకాకుండా ఆ ఫోటోలో యంగ్ గా కనిపిస్తూ బాలకృష్ణ అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన కొంతమంది బాలకృష్ణ అభిమానులు నటసింహం వయసు తగ్గుతుందా.... పెరుగుతుందా.... రోజురోజుకు ఇంకా యంగ్ గా తయారవుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>