MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh559841c9-6534-4b3d-b04a-b754c0afaf67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh559841c9-6534-4b3d-b04a-b754c0afaf67-415x250-IndiaHerald.jpgకీర్తి సురేష్ సౌత్ ఇండియన్ సినిమాలో ప్రముఖ నటి. అందంతో పాటు తన అభినయంతో ప్రేక్షకులను ఆమె కట్టి పడేస్తుంది. మలయాళం సినిమా ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఆమె ఈరోజు ఇండియాలో ఫేమస్ అయింది. మహానటి సినిమాకు గానూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డును పొందింది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో అగ్రతారలతో నటిస్తోన్న కీర్తి ఇప్పుడు బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న బేబీ జాన్‌లో కీర్తి సురేష్ ప్రస్తుతం హీరోయిన్‌గా నటిస్తోంది. Keerthy Suresh{#}Suresh;atlee kumar;keerthi suresh;kirti;Jaan;Hindi;Mahanati;Chitram;John;bollywood;Darsakudu;Director;Indian;News;Cinemaహీరోయిన్ కీర్తి సురేష్ ఏడాది సంపాదన ఎంతో తెలుసా? మీరు ఊహించలేరు!హీరోయిన్ కీర్తి సురేష్ ఏడాది సంపాదన ఎంతో తెలుసా? మీరు ఊహించలేరు!Keerthy Suresh{#}Suresh;atlee kumar;keerthi suresh;kirti;Jaan;Hindi;Mahanati;Chitram;John;bollywood;Darsakudu;Director;Indian;News;CinemaThu, 19 Sep 2024 13:45:00 GMTకీర్తి సురేష్ సౌత్ ఇండియన్ సినిమాలో ప్రముఖ నటి. అందంతో పాటు తన అభినయంతో ప్రేక్షకులను ఆమె కట్టి పడేస్తుంది. మలయాళం సినిమా ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఆమె ఈరోజు ఇండియాలో ఫేమస్ అయింది. మహానటి సినిమాకు గానూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డును పొందింది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో అగ్రతారలతో నటిస్తోన్న కీర్తి ఇప్పుడు బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న బేబీ జాన్‌లో కీర్తి సురేష్ ప్రస్తుతం హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఈ చిత్రం తమిళ చిత్రం తేరికి హిందీ రీమేక్. డిసెంబర్‌లో సినిమా విడుదల కానుంది. ఇలా సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా మారిన కీర్తి సురేష్ సంపాదన ఎంతో తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. తోటి హీరోయిన్లు అసూయ పడేలా గతేడాది ఆమె భారీ మొత్తంలో ఆర్జించారు. ఇక ఇప్పటికే ఆమె పేరిట భారీగా ఆస్తులు ఉన్నాయి. గతేడాది కీర్తి సురేష్ ఆదాయం అక్షరాలా రూ.25 కోట్లు. ఇక ఆమె మొత్తం ఆస్తి వందల కోట్లలో ఉంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.

నటి కీర్తి సురేశ్ ఆస్తి విలువ ఎంతనేది సమాచారం బయటకు వచ్చింది. ఆమె వార్షిక ఆదాయం గురించి పెద్దగా ఇప్పటి వరకు సమాచారం లేదు. ఈ సందర్భంలో, ప్రముఖ వెటరన్ జర్నలిస్ట్ బిస్మీ ఇటీవల నటి కీర్తి సురేష్ వార్షిక ఆదాయం గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కీర్తి సురేష్ రూ.4 కోట్ల వరకు తీసుకుంటోంది. ఇలా ఆమె 2023లో దాదాపు రూ.25 కోట్లు ఆర్జించింది. కీర్తి సురేష్ కూడా ప్రమోషనల్ యాడ్స్, పోస్ట్‌ల ద్వారా చాలా సంపాదిస్తోంది. దీంతో గత ఏడాది వరకు కీర్తి సంపాదించిన మొత్తం ఆదాయం కేవలం రూ. 120 కోట్లు అవుతుందని జర్నలిస్ట్ బిస్మీ చెప్పారు.


ఇక ఇటీవల ఆమె నటించిన రఘుతాత సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల అయింది. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళంలో రివాల్వర్ రీటా, కన్న వీడి సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్‌లో అట్లీ దర్శకత్వంలో బేబీ జాన్ షూటింగ్‌లో సైతం పాల్గొంటోంది. టాలీవుడ్‌లో సైతం ఆమె ఓ సినిమాకు సైన్ చేసింది. త్వరలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>